...
...
Next Story

ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో అనసూయ మూవీ.. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్‌లా డివైన్ ట్రెండ్‌లో అరి!

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అరి. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన అరి సినిమా కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్ వంటి సినిమాల తరహాలో డివైన్ టాక్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. అరిషడ్వర్గాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు.

Published on: Oct 14, 2025, 18:42:27 IST
Advertisement

ఇటీవల కాలంలో మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కరెక్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తిగా ఈ డివైన్ ఫీల్‌గుడ్ చిత్రాలను తెరకెక్కిస్తే జోరుగా దూసుకుపోతున్నాయి. అలా ఇప్పటికే వివిధ ఇండస్ట్రీల్లో పలు సినిమాలు సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయాయి.

మైథలాజికల్ టచ్‌తో డివైన్ వైబ్స్

ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో అనసూయ మూవీ.. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్‌లా డివైన్ ట్రెండ్‌లో అరి!
ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో అనసూయ మూవీ.. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్‌లా డివైన్ ట్రెండ్‌లో అరి!

ఇప్పుడు తాజాగా తెలుగులో కూడా ఓ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటుంది.ప్రస్తుతం డివైన్ ట్రెండ్‌ నడుస్తోందన్న విషయం తెలిసిందే. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్, కాంతార చాప్టర్ 1 చిత్రాలన్నీ కూడా మైథలాజికల్ టచ్‌తో డివైన్ వైబ్స్ కలిగించాయి.

అరిషడ్వర్గాల కాన్సెప్ట్

ఇక ఈ డివైన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. వాటిని బ్లాక్ బస్టర్ హిట్లను చేశారు. ఇక ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ అరిషడ్వర్గాలను కాన్సెప్ట్‌గా తీసుకుని, ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్‌తో పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ ‘అరి’ అనే మూవీని తీశాడు.

సందేశం, కృష్ణుడి ఎంట్రీ

గత వారం అంటే అక్టోబర్ 10న ‘అరి’ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అరి మూవీలో చూపించిన పాయింట్, చివర్లో ఇచ్చిన సందేశానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక చివర్లో శ్రీ కృష్ణుడి ఎంట్రీ, అరి షడ్వర్గాల గురించి ఆయన ఇచ్చే సందేశం అందరినీ ఆకట్టుకుంది.

20 నిమిషాల క్లైమాక్స్‌పై

మంచి సందేశాత్మకంగా చిత్రంగా అరిని మలిచారంటూ ఆడియెన్స్ దర్శకుడి మీద ప్రశంసల్ని కురిపించారు. ఇక మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా చివరి 20 నిమిషాల గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఆడియెన్స్ గుండెల్లోకి

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, సురభి ప్రభావతి ఇలా అందరూ తమ తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోశారు. మొత్తానికి డైరెక్టర్ జయశంకర్ మాత్రం పేపర్ బాయ్, అరి అంటూ వరుసగా రెండు మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు.

మరోసారి నిరూపించిన అనసూయ

ఇక యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి అరి మూవీతో అనసూయ భరద్వాజ్ నిరూపించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks