Asin Daughter: ఫోన్, టీవీలు లేవు.. ఏడేళ్లకే 12 భాషలు మాట్లాడుతున్న హీరోయిన్ ఆసిన్ కుమార్తె అరిన్- అసలైన పెంపకం ఇదే!
Asin Daughter Arin Speaks 12 Languages: మాజీ హీరోయిన్ ఆసిన్, మైక్రోమాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ దంపతుల ఏడేళ్ల కుమార్తె అరిన్ ఏకంగా 12 భాషల్లో మాట్లాడుతోంది. డిజిటల్ స్క్రీన్లకు దూరంగా, పుస్తకాలే ప్రపంచంగా చిన్నారిని పెంచుతున్న తీరుపై రాహుల్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Asin Daughter Arin Speaks 12 Languages: దక్షిణాది చిత్రసీమతో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ నటి ఆసిన్. హిందీలో 'గజిని', 'రెడీ', తెలుగులో శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ వంటి బంపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఏడేళ్ల కుమార్తెను పెంచుతున్న తీరు
అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మైక్రోమాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమయ్యారు ఆసిన్. సంసార జీవితానికే ప్రాధాన్యం ఇస్తూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటున్న ఆసిన్.. ఇప్పుడు తన ఏడేళ్ల కుమార్తె అరిన్ రేన్ శర్మను పెంచుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా ఈనాటి పిల్లలు చిన్నప్పటినుంచే స్మార్ట్‌ఫోన్లు, టీవీ స్క్రీన్లకు అలవాటు పడుతున్నారు. అయితే అరిన్ విషయంలో ఆసిన్ దంపతులు వినూత్నమైన, క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఎంచుకున్నారు. ఇటీవల 'మైగోవ్ ఇండియా' (MyGov India) ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్ శర్మ, తమ కుమార్తె పెంపకం వెనుక ఆసిన్ పడుతున్న శ్రమను, ఆమె చూపుతున్న శ్రద్ధను వివరంగా పంచుకున్నారు.
టీవీ, మొబైల్స్ లేవు.. పుస్తకాలే ప్రపంచం!
ప్రస్తుతం ఏడేళ్ల వయసున్న అరిన్, ఏకంగా 12 భాషలను అర్థం చేసుకోవడమే కాకుండా అనర్గళంగా మాట్లాడగలుగుతోంది. వీటిలో కొరియన్, జపనీస్, థాయ్, చైనీస్ (మాండరిన్) వంటి కష్టమైన విదేశీ భాషలు కూడా ఉండటం విశేషం.
"నాకు రెండు భాషలు మాట్లాడటమే కష్టంగా ఉంది. మేం కేవలం హిందీ, ఇంగ్లీషుకే పరిమితమయ్యాం. కానీ నా కుమార్తె మాత్రం 7 ఏళ్లకే 12 భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది" అని రాహుల్ శర్మ గర్వంగా వెల్లడించారు.
మా ఇల్లు పుస్తకాలతో నిండిపోయింది
చిన్నారికి ఈ స్థాయిలో భాషలపై పట్టు రావడానికి కారణం డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేకపోవడమేనని రాహుల్ శర్మ స్పష్టం చేశారు. "మా ఇంట్లో టీవీ లేదు, అరిన్‌కు ఇప్పటివరకు మొబైల్ ఫోన్ స్క్రీన్ అసలు చూపించలేదు. మా ఇల్లు పుస్తకాలతో నిండిపోయింది. బహుశా ఆమె చదివే స్కూల్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువ పుస్తకాలు ఉంటాయి" అని రాహుల్ చెప్పారు.
"ప్రస్తుతం ఆమె రెండో తరగతి చదువుతోంది, కానీ ఇంట్లో మాత్రం 8, 9 తరగతుల పుస్తకాలు ఉన్నాయి. 'ఇక నేరుగా పదో తరగతి బోర్డు పరీక్షలే రాయించేద్దాం, తేడా ఏముంది?' అని నేను సరదాగా అంటుంటాను. ఈ క్రెడిట్ అంతా పూర్తిగా ఆసిన్‌కే దక్కుతుంది" అని రాహుల్ శర్మ వివరించారు.
ఆసిన్ నా జీవితంలో దక్కిన పెద్ద విజయం!
తన జీవితంలో తీసుకున్న అత్యంత కీలకమైన, ఉత్తమమైన నిర్ణయం ఆసిన్‌ను పెళ్లి చేసుకోవడమేనని రాహుల్ శర్మ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో తన వెన్నంటి నిలిచి, నిరంతరం ప్రోత్సహించే శక్తి ఆసిన్ అని కొనియాడారు. ఆమె అండగా ఉండటం వల్లే వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను సులువుగా ఎదుర్కోగలుగుతున్నానని చెప్పారు.
2008లో ఆమీర్ ఖాన్ సరసన 'గజిని' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆసిన్, ఆ తర్వాత హిందీలో 'రెడీ', 'హౌస్‌ఫుల్ 2', 'బోల్ బచ్చన్', 'ఖిలాడీ 786' వంటి వరుస హిట్లతో స్టార్ డమ్ అనుభవించారు. 2016 జనవరిలో రాహుల్ శర్మను పెళ్లి చేసుకున్న అనంతరం నటనకు స్వస్తి చెప్పారు.
స్క్రీన్ టైమ్ తగ్గిస్తే
2017 అక్టోబర్‌లో అరిన్ జన్మించగా, అప్పటినుంచి ఆసిన్ పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు స్క్రీన్ టైమ్ తగ్గించి, పుస్తకాల వైపు మళ్లించడం ఎలాగో అసెన్ పెంపకం ఉదాహరణగా నిలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


