...
...
Next Story

Bigg Boss 10: ఇదేం ట్విస్ట్ బాసూ..బిగ్ బాస్ 10లోకి ఎవరూ ఊహించని స్టార్ కమెడియన్..అతనొస్తే పంచ్ లే పంచ్ లు..క్రేజీ ఆఫర్!

Bigg Boss 10: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10కు అంతా రెడీ అవుతోంది. మరో నెల రోజుల్లోనే ఈ సీజన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 10లోకి ఓ స్టార్ కమెడియన్ ఎంట్రీ ఉంటుందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ కమెడియన్ ఎవరో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 9, 2026, 05:37:13 IST
Advertisement

Bigg Boss 10: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న 'ఆటో' రాంప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి అతను చేసిన స్కిట్లు బుల్లితెరపై సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. స్వయంగా రచయిత కూడా అయిన రాంప్రసాద్, తక్కువ సమయంలోనే ఆన్-ది-స్పాట్ 'ఆటో పంచ్‌ల'తో అభిమానుల మనసు దోచుకున్నాడు.

బిగ్ బాస్ లోకి రాంప్రసాద్

ఇదేం ట్విస్ట్ బాసూ..బిగ్ బాస్ 10లోకి ఎవరూ ఊహించని స్టార్ కమెడియన్..అతనొస్తే పంచ్ లే పంచ్ లు..క్రేజీ ఆఫర్!
ఇదేం ట్విస్ట్ బాసూ..బిగ్ బాస్ 10లోకి ఎవరూ ఊహించని స్టార్ కమెడియన్..అతనొస్తే పంచ్ లే పంచ్ లు..క్రేజీ ఆఫర్!

సుదీర్ఘకాలంగా బుల్లితెరపై నవ్విస్తున్న రాంప్రసాద్.. ఇప్పుడు తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులారిటీ ఉన్న రియాలిటీ షో 'బిగ్‌బాస్' రాబోయే సీజన్ 10 కోసం నిర్వాహకులు అతణ్ని సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, రాంప్రసాద్ కూడా ఈ ఆఫర్‌ పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

అదిరే ఆఫర్

ఆటో రాంప్రసాద్ టీవీ రంగంలో మంచి పేరుంది. బుల్లితెర ఆడియన్స్ లో క్రేజ్ ఉంది. జబర్దస్త్ లో అతను వేసే స్కిట్లకు యూట్యూబ్ లోనూ మంచి వ్యూయర్షిప్ ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లోకి అతణ్ని రప్పించేందుకు మేకర్స్ అదిరే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్యధిక రెమ్యునరేషన్ మాట్లాడారని టాక్. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

బిగ్‌ బాస్ మేకర్స్ వ్యూహం

బిగ్‌ బాస్ తెలుగు గత కొన్ని సీజన్లను గమనిస్తే.. హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెంచడానికి మేకర్స్ తప్పనిసరిగా కామెడీ నేపథ్యం ఉన్న కంటెస్టెంట్లను బరిలోకి దించుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ముక్కు అవినాష్, ఫైమా, గీతూ రాయల్, రోహిణి, ఇమ్మాన్యుయేల్ వంటి జబర్దస్త్ అండ్ డిజిటల్ స్టార్స్ బిగ్‌ బాస్ హౌస్‌లోకి వెళ్ళి షో కి మంచి హైప్ తెచ్చారు.

షోకు ఎనర్జీ

కెరీర్‌కు మైలేజ్

గతంలో బిగ్‌బాస్‌లోకి వెళ్లిన చాలామంది కమెడియన్లకు ఆ షో కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ ఇచ్చింది. రాంప్రసాద్ కూడా కేవలం స్కిట్లకు మాత్రమే పరిమితం కాకుండా, తన వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు బిగ్‌ బాస్ ఒక సరైన వేదికగా మారనుంది.

ప్రస్తుతం ఈ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలోనూ, బుల్లితెర వర్గాల్లోనూ ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆటో రాంప్రసాద్ కన్ఫర్మ్ అయితే గనుక బిగ్‌బాస్ సీజన్ 10 హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సరికొత్త బిగ్ బాస్ 10 సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ అవుతుందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks