జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుని ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఇక అవతార్ 3 ఓటీటీ బాట పట్టనుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమవుతోంది.
అవతార్ 3 ఓటీటీ

సామ్ వర్తింగ్టన్, జో సల్దానా ప్రధాన పాత్రల్లో నటించిన విజువల్ వండర్ అవతార్ 3 బాక్సాఫీస్ వద్ద బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అరంగేట్రానికి సిద్ధమైంది. అవతార్ 3 సాధారణ ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందుగా ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) పద్ధతిలో విడుదల కానుంది.
ఎక్కడ చూడాలంటే?
అవతార్ 3 ఓటీటీలోకి రాబోతుంది. అయితే ముందుగా రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులోకి రానుంది. మార్చి 31, 2026న రిలీజ్ కానుంది. ఆ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో డబ్బులు చెల్లించి ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాను చూడవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-సేల్స్ కూడా ప్రారంభమయ్యాయి.
అందరికీ అప్పుడే
ప్రీమియం రెంటల్ పద్ధతి ముగిసిన తర్వాతే సాధారణ ఓటీటీ సబ్ స్క్రైబర్లకు అవతార్ 3 అందుబాటులోకి వస్తుంది. జూన్ 2026 నాటికి ఈ సినిమా డిస్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. ఇండియాలో అయితే జియోహాట్ స్టార్ లో రిలీజ్ కావొచ్చు. రీజినల్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల ఆధారంగా దీనిపై స్పష్టత రానుంది. ఇంట్లోనే కూర్చుని ఈ అద్భుత ప్రపంచాన్ని వీక్షించాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు.
అవతార్ 3 గురించి
అవతార్ 3 కథ పండోరా గ్రహం మీద ఉండే అగ్ని తెగ (యాష్ పీపుల్) చుట్టూ తిరుగుతుంది. ఈసారి జేమ్స్ కామెరూన్ నీటి ప్రపంచం నుంచి అగ్ని పర్వతాల నేపథ్యానికి ప్రేక్షకులను తీసుకెళ్లారు. గత రెండు భాగాల కంటే ఇందులో యాక్షన్, ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రభంజనం
{{/usCountry}}అవతార్ 3 కథ పండోరా గ్రహం మీద ఉండే అగ్ని తెగ (యాష్ పీపుల్) చుట్టూ తిరుగుతుంది. ఈసారి జేమ్స్ కామెరూన్ నీటి ప్రపంచం నుంచి అగ్ని పర్వతాల నేపథ్యానికి ప్రేక్షకులను తీసుకెళ్లారు. గత రెండు భాగాల కంటే ఇందులో యాక్షన్, ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రభంజనం
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా అవతార్ 3 కలెక్షన్లు అదిరిపోయాయి. డిసెంబర్ 19, 2025న థియేటర్లలో అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.486 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.
ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఏకంగా రూ.12,482 కోట్ల కలెక్షన్లను అవతార్ 3 ఖాతాలో వేసుకుంది. ఇండియాలో కూడా థియేటర్లలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. జేమ్స్ కామెరూన్ మేకింగ్ స్టైల్, అద్భుతమైన నేపథ్య సంగీతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.