Super Hero OTT: 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. థానోస్ చేసిన విధ్వంసం తర్వాత మిగిలిన సూపర్ హీరోలంతా ఒక్కటై చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను మళ్లీ ఫ్యాన్స్‌కు అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది.
అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్కోర్ ఓటీటీ

రీసెంట్ గా థియేటర్లలో రీ-రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ ఎండ్‌గేమ్: ఎన్కోర్ సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఇది కేవలం మనం గతంలో చూసిన పాత సినిమా మాత్రమే కాదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో రాబోయే భారీ మార్పులకు ఇది పునాది అని చెప్పొచ్చు.
కొత్త సీన్లు
'అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్కోర్' పేరుతో వచ్చిన ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్లో కొన్ని కొత్త పోస్ట్-క్రెడిట్ సీన్స్ యాడ్ చేశారు. రాబోయే బ్లాక్ బస్టర్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమాకు సంబంధించిన కీలకమైన క్లూస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ డూమ్, బ్రూస్ బ్యానర్ (హల్క్) మధ్య వచ్చే కొత్త సీన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.27 వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్
మార్వెల్ మూవీస్ అంటే ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పిచ్చి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే 'అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్కోర్' ఇవాళ (నవంబర్ 13) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది.
కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండటం మన ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్. సూపర్ హీరోలంతా కలిసి చేసిన పోరాటాన్ని మన ఆడియన్స్ తెలుగులోనూ చూసేయొచ్చు.
డూమ్స్‌డే సినిమాకు ఇది బిగినింగ్
{{/usCountry}}కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండటం మన ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్. సూపర్ హీరోలంతా కలిసి చేసిన పోరాటాన్ని మన ఆడియన్స్ తెలుగులోనూ చూసేయొచ్చు.
డూమ్స్‌డే సినిమాకు ఇది బిగినింగ్
{{/usCountry}}డిసెంబర్ మూడో వారంలో 'అవెంజర్స్: డూమ్స్‌డే' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఆ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే, ఈ 'ఎన్కోర్' వెర్షన్ చూడటం చాలా ముఖ్యం. రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్లీ విలన్ 'డాక్టర్ డూమ్' గా రీ-ఎంట్రీ ఇస్తుండటంతో, తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
సో, ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్ కు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి మళ్లీ ఆ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్ ల యాక్షన్ ను జియోహాట్‌స్టార్‌లో ఎంజాయ్ చేసేయండి.