దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా పేరే వినిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తూ 2025లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది. కేవలం కథతోనే కాకుండా, ఈ సినిమాలోని పాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
100 మిలియిన్ వ్యూస్

ముఖ్యంగా తెలుగు హీరోయిన్ అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆదరగొట్టిన డాన్స్ నంబర్ 'శరారత్' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ సూపర్ హిట్ సాంగ్ శరారత్ ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. ఈ నేపథ్యంలోనే బ్యూటిఫుల్ అయేషా ఖాన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
మురిసిపోయిన నటి
యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన సందర్భంగా అయేషా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆత్మీయమైన నోట్ రాశారు. దురంధర్ సినిమాకు హౌజ్ ఫుల్ నిండిన థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చుని తన పాటను వెండితెరపై చూసుకుంటున్న వీడియోను ఆయేషా ఖాన్ షేర్ చేశారు.
"వంద మిలియన్ల వ్యూస్! నిండిన థియేటర్‌లో నన్ను నేను పెద్ద తెరపై చూసుకోవడం ఒక మధురమైన అనుభూతి. 'శరారత్' పాటకు మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రాకు, నాపై నమ్మకం ఉంచిన దర్శకుడు ఆదిత్య ధర్ గారికి కృతజ్ఞతలు" అంటూ తనను తాను చూస్తూ మురిసిపోయింది ఆయేషా ఖాన్.
‘ఏలేందుకే వచ్చాను’
తన భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆయేషా చాలా స్పష్టంగా మాట్లాడారు. "నేను ఇక్కడ ఏలడానికి వచ్చాను, ఏదీ నన్ను ఆపలేదు. ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు, నా పని పట్ల నాకు ఉన్న ఇష్టం, కష్టం మీద ఉన్న నమ్మకంతో చెబుతున్నాను. నా ప్రతిభపై, దేవుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఏవైతే కోరుకున్నానో అవి ఒకరోజు తప్పకుండా సాధిస్తాను" అని ఆయేషా ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.
{{/usCountry}}తన భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆయేషా చాలా స్పష్టంగా మాట్లాడారు. "నేను ఇక్కడ ఏలడానికి వచ్చాను, ఏదీ నన్ను ఆపలేదు. ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు, నా పని పట్ల నాకు ఉన్న ఇష్టం, కష్టం మీద ఉన్న నమ్మకంతో చెబుతున్నాను. నా ప్రతిభపై, దేవుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఏవైతే కోరుకున్నానో అవి ఒకరోజు తప్పకుండా సాధిస్తాను" అని ఆయేషా ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.
{{/usCountry}}కష్టసుఖాల్లో అండగా నిలిచిన తన కుటుంబం, స్నేహితులకు ఆయేషా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డ్రామా లేనిదే 'అయేషా ఖాన్' లేదని, 2026 కూడా మరిన్ని పాఠాలను, విజయాలను తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాట వెనుక ఉన్న విశేషాలు
'శరారత్' పాటను కరాచీలో జరిగే ఒక విలాసవంతమైన వివాహ వేడుక నేపథ్యంలో చిత్రీకరించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా వివాహ నృత్యకారులుగా కనిపిస్తారు. శాశ్వత్ సచ్‌దేవ్ స్వరపరిచిన ఈ పాటను మధుబంతి బాగ్చి, జాస్మిన్ శాండ్లాస్ ఆలపించగా, విజయ్ గంగూలీ కొరియోగ్రఫీ చేశారు.
1200 కోట్లు దాటిన ధురంధర్
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన దురంధర్ సినిమా రూ. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు. కాగా ఆయేషా ఖాన్ తెలుగులో ఓమ్ భీమ్ బుష్, ముఖచిత్రం తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.