రాజమౌళి తెరకెక్కిన 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమాలను కలిపి రూపొందించిన మూవీ 'బాహుబలి: ది ఎపిక్'. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా నటించిన ఈ రీమాస్టర్ వెర్షన్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది.
బాహుబలి ది ఎపిక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

తొలి రోజు నుంచి మంచి కలెక్షన్స్ అందుకున్న బాహుబలి ది ఎపిక్ ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ను దాటేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా బాహుబలి సినిమాకు ఆరు రోజుల్లో రూ. 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి.
7 రోజుల కలెక్షన్స్ ఇలా
అలాగే, కర్ణాటక నుంచి రూ. 5 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ. 12 కోట్లు కలెక్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఏడు రోజుల్లో బాహుబలి ది ఎపిక్ మూవీ రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.
బాహుబలి ది ఎపిక్ నెట్ కలెక్షన్స్
ఇదిలా ఉంటే, ఇండియాలో ఆరో రోజున బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 1.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ సంస్థ పేర్కొంది. దీంతో ఆరు రోజుల్లో ఇండియాలో బాహుబలి ది ఎపిక్ మూవీకి రూ. 29.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
బాహుబలి ది ఎపిక్ ఆక్యుపెన్సీ
అంటే, రూ. 30 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్‌కు బాహుబలి ది ఎపిక్ చేరువలో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నవంబర్ 5న తెలుగులో బాహుబలి ది ఎపిక్ సినిమాకు ఉదయం 13.13 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం. అది మధ్యాహ్నానికి 16.33 శాతంగా పెరిగింది.
హిందీ-తమిళంలో
{{/usCountry}}అంటే, రూ. 30 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్‌కు బాహుబలి ది ఎపిక్ చేరువలో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నవంబర్ 5న తెలుగులో బాహుబలి ది ఎపిక్ సినిమాకు ఉదయం 13.13 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం. అది మధ్యాహ్నానికి 16.33 శాతంగా పెరిగింది.
హిందీ-తమిళంలో
{{/usCountry}}ఇక హిందీ వెర్షన్‌కు ఉదయం పూట 9.96 శాతం ఆక్యుపెన్సీ రాగా మధ్యాహ్నాం 12.06 శాతానికి ఎగబాకింది. అలాగే, తమిళంలో 20.40 శాతం రాగా నైట్ షోలకు వచ్చేసరికి 25.07 శాతానికి బాహుబలి ది ఎపిక్ థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగినట్లు సమాచారం.
బాహుబలి ది ఎపిక్ స్క్రీనింగ్స్
కాగా, బాహుబలి ది ఎపిక్ ప్రదర్శనల పరంగా చూస్తే తెలుగు వెర్షన్ హైదరాబాద్ (324 షోలు) అధిక షోలతో ఉంది. ఆ తర్వాత హిందీ వెర్షన్ ఢిల్లీ-ఎన్సీఆర్‌లో (176 షోలు), బెంగళూరు (133 షోలు), ముంబై (87 షోలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళ వెర్షన్ చెన్నైలో 55 షోలలో ఆడుతూ అతి తక్కువ స్క్రీనింగ్‌ను నమోదు చేసింది.