ఓటీటీలోకి భారీ సినిమా వచ్చేసింది. ప్రతిష్ఠాత్మక మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అదే బాహుబలి ది ఎపిక్. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి: ది ఎపిక్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఆయన గతంలో రూపొందించిన 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి 2: ది కంక్లూజన్' (2017) చిత్రాల కలయిక ఇది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తోంది.
బాహుబలి ది ఎపిక్ ఓటీటీ

క్రిస్మస్ సందర్భంగా బాహుబలి: ది ఎపిక్ చిత్రం గురువారం (డిసెంబర్ 25) ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం రన్‌టైమ్ 3 గంటల 43 నిమిషాలు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా తదితరులు నటించారు. బాహుబలి 1, 2 సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
55 రోజుల తర్వాత
బాహుబలి: ది ఎపిక్ చిత్రం థియేటర్లలో విడుదలైన 55 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సాధారణంగా చాలా తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వస్తాయి. కొన్ని అరుదైన సందర్భాలలో ఇలా మినహాయింపులు ఉంటాయి.
రీ రిలీజ్ రికార్డు
రీ రిలీజ్ పరంగా చూసుకుంటే బాహుబలి ది ఎపిక్ మూవీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సక్నిల్క్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ. 51.72 కోట్లు వసూలు చేసింది. దీనితో 'సనం తేరి కసం', 'తుంబాడ్', 'ఘిల్లి' వంటి చిత్రాల రీ-రిలీజ్ వసూళ్లను అధిగమించింది బాహుబలి ది ఎపిక్. అత్యధికంగా వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ చిత్రంగా నిలిచి, హిస్టరీ క్రియేట్ చేసింది.
అంతకుముందు బాహుబలి 1 ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లు వసూలు చేయగా, బాహుబలి 2 రూ.1788 కోట్లు కొల్లగొట్టింది. ఇది 'యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్' తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీగా నిలిచింది.
బాహుబలి తర్వాత
{{/usCountry}}అంతకుముందు బాహుబలి 1 ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లు వసూలు చేయగా, బాహుబలి 2 రూ.1788 కోట్లు కొల్లగొట్టింది. ఇది 'యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్' తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీగా నిలిచింది.
బాహుబలి తర్వాత
{{/usCountry}}బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి 2022లో 'RRR' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుండి 'నాటు నాటు' పాట గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులను గెలుచుకొని, చిత్ర దర్శకుడిని ప్రపంచ పటంలో నిలబెట్టింది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో 'వారణాసి' తెరకెక్కిస్తున్ననారు.