హాలీవుడ్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కూడా ఆదరిస్తారు. ఓటీటీల్లో ఈ మూవీస్ కు ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా బ్రాడ్ పిట్ లాంటి స్టార్లు నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఓ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లో రిలీజైన మూడేళ్లకు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రాబోతున్న మూవీ ‘బేబిలాన్’.
బేబిలాన్ ఓటీటీ

హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ బేబిలాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 7 నుంచి బేబిలాన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నప్పటికీ అది రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
రొమాంటిక్ డ్రామాగా
దర్శకుడు డెమియన్ చాజెల్ ‘బేబిలాన్’ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఇది హాలీవుడ్ చరిత్రను, ఇందులోని చీకటి కోణాలను తెలుపుతుంది. ఈ సినిమా 2022లో థియేటర్లో రిలీజైంది. బేబిలాన్ మూవీ మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాలకు మారుతున్న కాలాన్ని చూపిస్తుంది.1920 ల హాలీవుడ్ మార్పులను కళ్లకు కడుతుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
బేబిలాన్ స్టోరీ
1920ల చివర్లో మూకీ నుంచి టాకీలోకి మారుతున్న హాలీవుడ్ చిత్రాల మార్పులను బేబిలాన్ సినిమా మూవీ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇందులో జాకీ కాన్రాడ్ (బ్రాడ్ పిట్) ఓ పెద్ద మూకీ స్టార్. నెల్లీ లారాయ్ (మార్గాట్ రాబీ) కాలిఫోర్నియాలోని ఓ అమ్మాయి. పాపులర్ కావాలని కలలు కంటుంది. మ్యాన్యుయెల్ టోర్రెస్ (డియెగో కాల్వా) సినిమా స్టూడియోలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదుగుతాడు.
హాలీవుడ్ లో పార్టీలు, విలాసాలు బేబిలాన్ సినిమాలో చూడొచ్చు. అలాగే హాలీవుడ్ స్వర్ణ యుగాన్ని కూడా చూపించారు. అంతే కాకుండా మూకీల నుంచి టాకీలకు సినిమాలు మారే క్రమం, ఆ కారణంగా కలిగే పెను మార్పులు, ఇండస్ట్రీలోని చీకటి కోణాలు ఈ సినిమా కథలో భాగమే.
స్క్రిప్ట్ లో లేని ముద్దు
{{/usCountry}}హాలీవుడ్ లో పార్టీలు, విలాసాలు బేబిలాన్ సినిమాలో చూడొచ్చు. అలాగే హాలీవుడ్ స్వర్ణ యుగాన్ని కూడా చూపించారు. అంతే కాకుండా మూకీల నుంచి టాకీలకు సినిమాలు మారే క్రమం, ఆ కారణంగా కలిగే పెను మార్పులు, ఇండస్ట్రీలోని చీకటి కోణాలు ఈ సినిమా కథలో భాగమే.
స్క్రిప్ట్ లో లేని ముద్దు
{{/usCountry}}సాధారణంగా సినిమాల్లో సీన్లు అన్ని స్క్రిప్ట్ ప్రకారమే సాగిపోతుంటాయి. డైరెక్టర్ చెప్పినట్లు యాక్టర్లు చేయాలి. కానీ బేబిలాన్ షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ లో లేకుండానే, డైరెక్టర్ చెప్పకుండానే బ్రాడ్ పిట్ కు మార్గోట్ రాబీ ముద్దు పెడుతుంది. ఈ లిప్ కిస్ సీన్ అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. "అది స్క్రిప్ట్ లో లేదు. కానీ నేను అనుకున్నా. బ్రాడ్ పిట్ ను ముద్దు పెట్టుకునే అవకాశం మరెప్పుడు వస్తుంది? అందుకే అలా చేశా’’ అని మార్గోట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.