...
...
Next Story

NBK111 Title: దేఖో షేర్ ఆగయా..మామూలుగా లేదు..బాల‌కృష్ణ సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌..రిలీజ్ ఎప్పుడంటే? నాగార్జునతో ఢీ!

NBK111 Title: నందమూరి నటసింహం బాల‌కృష్ణ మరో పవర్ ఫుల్ టైటిల్ తో థియేటర్లకు రాబోతున్నారు. ఆయన 111వ సినిమా టైటిల్ ను ఇవాళ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ టైటిల్, రిలీజ్ డేట్ పై ఓ లుక్కేయండి.

Published on: Sep 6, 2026, 18:51:28 IST
Advertisement

NBK111 Title: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ కొత్త సినిమా టైటిల్ రివీలైంది. గోపీచంద్ మలినేని మూవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పేరును ఇవాళ ప్రకటించారు మేకర్స్. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘దాదా’ అనే టైటిల్ పెట్టారు.

దాదా టైటిల్

మామూలుగా లేదు.. బాల‌కృష్ణ సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. రిలీజ్ ఎప్పుడంటే? (x/NBKisDADA)
మామూలుగా లేదు.. బాల‌కృష్ణ సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. రిలీజ్ ఎప్పుడంటే? (x/NBKisDADA)

నందమూరి బాల‌కృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మూవీకి ఇన్ని రోజులూ ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్ ఉండేది. ఈ రోజు (సెప్టెంబర్ 6) ఈ మూవీకి అఫీషియల్ గా ‘దాదా’ అనే పవర్ ఫుల్ పేరును అనౌన్స్ చేశారు.

వీడియో గ్లింప్స్

దాదా మూవీ టైటిల్ రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ అదిరిపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ బాల‌కృష్ణ మరోసారి మాస్ అవతారంలో రెచ్చిపోయారు. తనదైన స్టైల్లో యాక్షన్ సీన్స్ లో ఫైట్స్ తో చెలరేగిపోయారు.

‘‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు. బుల్లెట్స్ కు బలుపుండాలి. గన్స్ కు గట్స్ ఉండాలి’’ అని బాల‌కృష్ణ తన స్టైల్లో విజిల్ కొట్టేంచేలా డైలాగ్ పేల్చారు.

నాగార్జునతో ఢీ

నందమూరి బాల‌కృష్ణ తన దాదా సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రాబోతున్నారు. అయితే నాగార్జునతో ఆయన బాక్సాఫీస్ కు సై అంటున్నారు. దాదా మూవీ క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. అదే రోజు నాగార్జున ‘కింగ్ 100’ మూవీ కూడా విడుదల అవుతుంది. అంటే ఒకే రోజు బాల‌కృష్ణ, నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవబోతున్నాయన్న మాట.

దాదా గురించి

దాదా సినిమాను వెంకట సతీష్ కిళారు నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ముగ్గురు లెజెండ్లు

ముగ్గురు తెలుగు లెజెండ్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాల‌కృష్ణ దాదాపు ఒకే కాన్సెప్ట్ స్టోరీ లైన్ తో థియేటర్లకు రాబోతుండటం విశేషం. చిరంజీవి ‘కాకా’, నాగార్జున ‘కింగ్ 100’, బాల‌కృష్ణ ‘దాదా’.. ఈ మూడు సినిమాలు కూడా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయని టాక్. చిరంజీవి మూవీ సంక్రాంతి రేసుకు సై అన్న సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks