Band Melam: కోర్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ సినిమాలో మరోసారి వీళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
బ్యాండ్ మేళం ఓటీటీ

లేటెస్ట్ తెలుగు యూత్ మూవీ ‘బ్యాండ్ మేళం’ డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 24 నుంచి జీ5 తెలుగు ఓటీటీలో బ్యాండ్ మేళం సినిమా ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ శుక్రవారం (ఏప్రిల్ 17) పోస్టర్ షేర్ చేసింది.
‘‘బ్లాక్ బస్టర్ పెయిర్ మళ్లీ రాబోతుంది. మీరు మెచ్చిన జంట మరోసారి దరువు వేయబోతుంది. రిథమ్ కు మీరు రెడీనా? ఏప్రిల్ 24న బ్యాండ్ మేళం ప్రీమియర్ కేవలం జీ5లో మాత్రమే’’ అని జీ5 తెలుగు ఎక్స్ లో పోస్టు చేసింది.
థియేటర్ రెస్పాన్స్
బ్యాండ్ మేళం సినిమాకు థియేటర్లో మిక్స్ డ్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం మార్చి 26న థియేటర్లో రిలీజైంది. ఈ చిత్రానికి సతీశ్ జవ్వాజి డైైరెక్టర్. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కింద కావ్య, శ్రావ్య ఈ సినిమాను నిర్మించారు. బ్యాండ్ మేళం మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, గోపరాజు తదితరులు నటించారు.
బ్యాండ్ మేళం స్టోరీ
{{/usCountry}}బ్యాండ్ మేళం సినిమాకు థియేటర్లో మిక్స్ డ్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం మార్చి 26న థియేటర్లో రిలీజైంది. ఈ చిత్రానికి సతీశ్ జవ్వాజి డైైరెక్టర్. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కింద కావ్య, శ్రావ్య ఈ సినిమాను నిర్మించారు. బ్యాండ్ మేళం మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, గోపరాజు తదితరులు నటించారు.
బ్యాండ్ మేళం స్టోరీ
{{/usCountry}}కోర్ట్ సినిమాతో మెప్పించిన రోషన్, శ్రీదేవి మరోసారి జత కట్టడంతో బ్యాండ్ మేళం మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో వాళ్లు బావమరదళ్లుగా నటించారు. యాదగిరి అలియాస్ గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి)కి పెళ్లి చేయాలని వాళ్ల చిన్నప్పుడే పెద్దలు నిశ్చయిస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి.
గిరికి మ్యూజిక్ అంటే ఇష్టం. రాజీ ఏమో టాపర్. వీళ్లిద్దరి మధ్య విభేధాలు వస్తాయి. ఊర్లో ఫ్రెండ్స్ తో కలిసి గిరి మ్యూజిక్ బ్యాండ్ పెడతారు. మరోవైపు పై చదువుల కోసం రాజీ సిటీకి వెళ్తుంది.
ఆ ట్విస్ట్
రాజీనే తనకు కాబోయే పెళ్లాం అని గిరి కలలు కంటుంటాడు. కానీ రాజీ తండ్రి సాయన్న (సాయి కుమార్) మాత్రం తన కూతురిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వేరే వాళ్లతో పెళ్లికి రాజీ ఒప్పుకుందా? యాదగిరి ఏం చేశాడు? అన్నది బ్యాండ్ మేళం సినిమాలో చూడాల్సిందే.