...
...
Next Story

Bandla Ganesh Prakash Raj: రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ పీక్ ఎటాక్.. అదే కారణమా?

Bandla Ganesh vs Prakash Raj: ఏపీ కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ‘గేమ్ ఆన్’ ట్వీట్‌ టాలీవుడ్‌లో చిచ్చు రేపింది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నిర్మాత బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చి, ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Published on: Jul 6, 2026, 12:09:05 IST
Advertisement

Bandla Ganesh vs Prakash Raj: టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇద్దరు వ్యక్తులు తలపడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అదే జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ రాజకీయాలు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేస్తున్న విమర్శలపై నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పీక్ లెవెల్ పర్సనల్ ఎటాక్‌కు దిగాడు.

అసలేం జరిగిందంటే..?

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ పీక్ ఎటాక్ (x)
రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ పీక్ ఎటాక్ (x)

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ తీరును, పవన్ కళ్యాణ్ వైఖరిని గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఎండగడుతున్నాడు. ముఖ్యంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ విషయంలో కూటమి ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన లేటెస్ట్ గా ఒక పవర్‌ఫుల్ వీడియో పోస్ట్ పెట్టాడు.

"మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justasking" అని ప్రకాష్ రాజ్ వీడియోను పోస్టు చేశాడు.

బండ్ల గణేష్ ఫైర్

ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు మరింతగా రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్‌ను తన ప్రాణంగా భావించే బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రకాష్ రాజ్‌కు అసలు సినిమాలే లేవంటూ కెరీర్‌ను కూడా లాగుతూ దారుణమైన కౌంటర్ ఇచ్చాడు.

“నీకు షూటింగ్‌లు లేవు.. పని లేదు”

ప్రకాష్ రాజ్ ట్వీట్‌ను కోట్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.

పాత పగలు కూడా కారణమా?

ఈ ఇద్దరి మధ్య ఈ స్థాయి వ్యక్తిగత దూషణలు జరగడం వెనుక కేవలం పవన్ కళ్యాణ్ అంశం మాత్రమే కాదు, గతంలో జరిగిన ‘మా’ (MAA) ఎన్నికల వివాదాలు కూడా ఉన్నాయని ఫిలిం నగర్ టాక్. అప్పట్లో ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు వ్యతిరేకంగా బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ నెగెటివ్‌గా పోస్టులు పెడుతున్నాడు.

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సమయం చూసి పాత లెక్కలతో కలిపి గట్టిగా వడ్డించారనే చర్చ నడుస్తోంది. మరి ఈ పర్సనల్ ఎటాక్‌పై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks