Bandla Ganesh vs Prakash Raj: నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్?- ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై బండ్ల గణేష్ ఫైర్!
Bandla Ganesh vs Prakash Raj: టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, నటుడు-నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియాలో సరికొత్త పొలిటికల్ వార్ మొదలైంది. ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ రెచ్చిపోయాడు. అసహ్యమేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు ఏమైందో ఇక్కడ చూసేయండి.
Bandla Ganesh vs Prakash Raj: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్' వరుస అరెస్టుల పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డాడు. దీనికి కౌంటర్ గా బండ్ల గణేష్ పెట్టిన ఘాటు కౌంటర్ సంచలనంగా మారింది.

ప్రకాష్ రాజ్ రియాక్షన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన రావణ్‌కు కోర్టు వరుసగా 4 సార్లు బెయిల్ మంజూరు అయింది. అయితే పోలీసులు వెంటనే 5వ సారి (యూఏపీఏ - UAPA చట్టం కింద) అరెస్ట్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టాడు.
ప్రజలు గమనిస్తున్నారంటూ
ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (@ncbn), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (@PawanKalyan) లను ట్యాగ్ చేస్తూ.. "4వ సారి బెయిల్.. మళ్లీ ఐదోసారి అరెస్ట్.. ఇది కోర్టులను అపహాస్యం చేయడమే. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలంటే మీకున్న అహంకారం, మీ ఫ్రస్ట్రేషన్, మీ భయాన్ని మేం చూస్తున్నాం. మా పోరాటం కొనసాగుతుంది" అంటూ హ్యాష్ ట్యాగ్ #justasking తో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు.
బండ్ల గణేష్ కౌంటర్
పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తుడు, జనసేన మద్దతుదారుడైన నిర్మాత బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పొలిటికల్ ట్వీట్‌పై అదే స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ను కోట్ చేస్తూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించాడు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామాలు ఆడుతున్నావంటూ ప్రశ్నించాడు.
సంచలన కామెంట్లు
- "నీ స్థాయి ఏంటో తెలుసుకో": బండ్ల గణేష్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నాడు.. "నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో."
- "అసహ్యం కలుగుతోంది": అంతటితో ఆగకుండా ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. "అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది.
- ‘‘గౌరవం పోతుంది’’: నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది. కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది" అంటూ బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్
ఈ వివాదానికి ప్రధాన కారణమైన 'ప్రశ్న రావణ్' అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే స్పందిస్తూ.. "వ్యక్తిగత స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్య్రం అనేది అపరిమితమైనది కాదు. కుటుంబ సభ్యులను, ఆడవారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడటం క్రిమినల్ నేరం" అని స్పష్టం చేశారు.
అయితే ప్రకాష్ రాజ్ మాత్రం దీనిని 'కక్షసాధింపు రాజకీయాలు'గా అభివర్ణిస్తుండగా, బండ్ల గణేష్ రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్‌కు గట్టి కౌంటర్ ఇవ్వడంతో ఈ సోషల్ మీడియా 'ఎక్స్' (X) వార్ ఇప్పుడు టాలీవుడ్, ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


