Bandla Ganesh: టాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అతను చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తనను ఓ సీనియర్ నటుడు చెప్పుతో కొట్టాడని బండ్ల గణేష్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలు తెగ వైరల్ గా మారాయి.
బండ్ల గణేష్ కామెంట్లు

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో తాజాగా బండ్ల గణేష్ పాల్గొన్నాడు. చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడాడు. ఈ క్రమంలోనే సంచలన కామెంట్లు చేశాడు.
‘‘ఇండస్ట్రీలో అప్పుడు ఓ పెద్దాయన ఉండేవాడు. ఆయన మంచివాడే. నాకు సాయం కూడా చేశాడు. ఆయన కోపం నాకు వరమైంది. ఆ రోజు ఏ మూడ్ లో ఉన్నాడో ఏమో మరి. పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఉండొచ్చు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు అది’’ అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.
చెప్పు దెబ్బ
‘‘నేను, ఇంకో యాక్టర్ కూర్చుకున్నాం. సార్ సార్ అనడం మనకు అలవాటు కదా. అలాగే అంటున్నా. సంబంధం లేకుండా చెప్పు తీసుకొని కొట్టాడు. భగవంతుడి మీద ఒట్టు. పర్సనల్ టెన్షన్ ఏదో ఉన్నట్లుంది. తర్వాత రెండు రోజులకు సారీ చెప్పాడు’’ అని బండ్ల గణేష్ సంచలన విషయాన్ని వెల్లడించాడు.
అప్పుడే డిసైడ్ అయ్యా
‘‘జీవితంలో మనిషికి కోపమొస్తే ఎక్కువగా పనికి రాని వస్తువులను పగలకొడతాం. మనకంటే బలహీనుడి మీద విశ్వ రూపం చూపిస్తాం. నువ్వు దమ్ముంటే నీకంటే పవర్ ఫుల్ వాడితో గొడవ పడాలి. ఆ రోజు వచ్చి కారు ఎక్కా. కార్లో ఉన్న మరో వ్యక్తితో చెప్పా. ‘ బాబాయ్, నా దగ్గర డబ్బు లేదనే కదా చెప్పుతో కొట్టాడు. ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా’ అని ఆ రోజు చెప్పా. అదే నా అచీవ్ మెంట్’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నాడు.
గోహత్య కంటే పాపం
ఇదే పాడ్ కాస్ట్ లో బండ్ల గణేష్ ఇంకా చాలా విషయాలపై మాట్లాడాడు. ప్రొడ్యూసర్ గా డబ్బులు పొగొట్టుకునే వ్యాపారం చేయడం గోహత్య కంటే పాపమని బండ్ల గణేష్ చెప్పాడు. తీన్మార్ మూవీతో కూడా తాను డబ్బులు సంపాదించానని వెల్లడించాడు.
పవన్ తో మూవీ తీసి
{{/usCountry}}ఇదే పాడ్ కాస్ట్ లో బండ్ల గణేష్ ఇంకా చాలా విషయాలపై మాట్లాడాడు. ప్రొడ్యూసర్ గా డబ్బులు పొగొట్టుకునే వ్యాపారం చేయడం గోహత్య కంటే పాపమని బండ్ల గణేష్ చెప్పాడు. తీన్మార్ మూవీతో కూడా తాను డబ్బులు సంపాదించానని వెల్లడించాడు.
పవన్ తో మూవీ తీసి
{{/usCountry}}పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిలా కొలుస్తాడు బండ్ల గణేష్. ‘‘పవన్ కళ్యాణ్ తో మూవీ తీయాలి. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ఉలిక్కి పడేలా చేయాలి. ఆ తర్వాత బ్యానర్ ఆపాలని కోరిక’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నాడు.