Baththa OTT: విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్, కామెడీ డ్రామా 'బత్తా' (Baththa) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 1, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు రెడీ అయింది.
బత్తా ఓటీటీ రిలీజ్ డేట్

బత్తా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అక్టోబర్ 29, 2026 నుంచి ఈ బత్తా సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
సినిమా స్టోరీ ఏంటంటే?
1986 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో ఈ బత్తా సినిమా కథ నడుస్తుంది. బత్తా (విజయ్ సేతుపతి) ఒక క్రూరమైన లోకల్ గ్యాంగ్‌స్టర్. తన పేరు చెబితేనే చుట్టుపక్కల అందరికీ వణుకు పుడుతుంది. అయితే అనుకోకుండా ఒకరోజు బత్తా ఒక స్కూల్ బాత్రూమ్‌లో లాక్ అయిపోతాడు.
బాత్రూమ్ లోనే బత్తా ఉండిపోతాడు. అప్పుడు అదే ఏరియాకు చెందిన శబరి అనే కుర్రాడు రంగంలోకి దిగుతాడు. ఆ పిల్లాడు భయపడుతూనే బత్తాను ఆ బాత్రూమ్ నుంచి ఎలా రక్షించాడు? ఆ సంఘటన తర్వాత బత్తా జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ సినిమా అసలు కథ. యాక్షన్‌తో పాటు ఎమోషన్, డార్క్ కామెడీ కలగలిపి ఈ మూవీని తెరకెక్కించారు.
కాస్ట్ అండ్ క్రూ
ఈ బత్తా సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా లిజోమోల్ జోస్ నటించింది. మాస్టర్ సాయి పృథ్విరాజ్ (శబరి), బేబీ సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ బాలాజీ తరణీధరన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.
నెట్‌ఫ్లిక్స్ జోరు
{{/usCountry}}ఈ బత్తా సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా లిజోమోల్ జోస్ నటించింది. మాస్టర్ సాయి పృథ్విరాజ్ (శబరి), బేబీ సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ బాలాజీ తరణీధరన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.
నెట్‌ఫ్లిక్స్ జోరు
{{/usCountry}}ఇంటర్నేషనల్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ రీచ్ పెంచుకునే దిశగా బాగా ప్లాన్ చేస్తోంది. తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగులో వస్తున్న క్రేజీ సినిమాలను, కొత్త చిత్రాలను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తూ రేసులో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటుడి బత్తా మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది.
విజయ్ సేతుపతికి తమిళంలోనే కాదు తెలుగు సహా ఇతర సౌత్ ఇండియా భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. వీళ్లు ఓటీటీలో బత్తాను చూసే ఛాన్స్ ఉంది.