హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేయసి కావ్య రెడ్డిని అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 6) రాత్రి హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య నిశ్చితార్థం నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రేయసికి ప్రపోజ్

బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమంలో తనకు కాబోయే భార్య కావ్యకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాటిక్ లెవల్ లో ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. ‘విల్ యూ మ్యారీ మీ’ అని రాసి ఉన్న వైట్ టీషర్ట్స్ వేసుకొని కొంతమంది కుర్రాళ్లు స్టేజీపైకి వెళ్లారు. వాళ్ల చేతుల్లోని లవ్ బెలూన్స్ ను గాల్లోకి వదిలడం కనిపించింది.
మోకాలిపై కూర్చొని
అప్పుడే ప్రేయసి కావ్యతో కలిసి స్టేజీ మీదకు వెళ్లిన బెల్లంకొండ శ్రీనివాస్ మోకాలిపై కూర్చుని ఉంగరం బయటకు తీశాడు. తనకు కాబోయే భార్య చేతికి ఆ రింగ్ ను తొడిగాడు. ఇదంతా ఊహించని కావ్య ఆశ్చర్యపోయింది. ఆమె సంతోషం పట్టలేక నవ్వుతూనే ఉంది. ఆ తర్వాత బాణాసంచా వెలుగులతో ఆకాశం మెరిసిపోయింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. క్యూట్ మూమెంట్స్ అంటూ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
పరిచయ వేడుక
అయితే ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వీళ్ల ఎంగేజ్మెంట్ అయిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ అది ఎంగేజ్మెంట్ కాదని, కావ్య పరిచయ వేడుక అని బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీనిచ్చాడు. ఇప్పుడు వీళ్ల నిశ్చితార్థం జరిగింది.
కావ్య ఎవరు?
{{/usCountry}}అయితే ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వీళ్ల ఎంగేజ్మెంట్ అయిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ అది ఎంగేజ్మెంట్ కాదని, కావ్య పరిచయ వేడుక అని బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీనిచ్చాడు. ఇప్పుడు వీళ్ల నిశ్చితార్థం జరిగింది.
కావ్య ఎవరు?
{{/usCountry}}బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కావ్య ఎవరు? అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అయితే కావ్యకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయం కానీ, సంబంధం కానీ లేదు. కావ్య రెడ్డి తాత గతంలో జడ్జిగా పనిచేశారని అంటున్నారు. ఆమె తండ్రి ఓ లాయర్ అని తెలిసింది. శ్రీనివాస్, కావ్య పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసిందని టాక్.
సినిమాలతో బిజీ
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మూడు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. టైసన్ నాయుడు, హైందవ, రామం సినిమాల్లో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ చేస్తున్న మూడు సినిమాలు కూడా స్టోరీ పరంగా దేనికదే డిఫరెంట్ గా ఉంది.