Must Watch 6 Best OTT Horror Thrillers In Telugu: తెలుగు ప్రేక్షకులకు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఇలాంటి కంటెంట్‌ను చూసేందుకు మనవాళ్లు ఎంతో ఇష్టపడతారు.
టాప్ 6 ఓటీటీ హారర్ థ్రిల్లర్స్

ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలపై హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో అనేక హారర్ వెబ్ సిరీస్‌లు తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. అవి చూస్తున్నప్పుడు వచ్చే భయానక శబ్దాలు, ఊహించని ట్విస్టులు గుండె గుభేల్ మనిపిస్తాయి. తెలుగులో వణుకు పుట్టించే ది బెస్ట్ 6 ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం. రోజుకోటి చూసేయండి మరి.
సరికొత్త భయాన్ని పరిచయం చేసిన 'ఖౌఫ్'
1. ఖౌఫ్ (Khauf): ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.4 | ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
2025లో విడుదలైన ఈ ఓటీటీ సిరీస్ సరికొత్త హారర్ అనుభూతిని ఇస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ చుమ్ దరాంగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కథ ఒక గర్ల్స్ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. ఆ హాస్టల్‌ను ఒక భయంకరమైన దెయ్యం ఆవహిస్తుంది. అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్న ఆ అమ్మాయిలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు. ఇందులో కొన్ని సీన్లు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
మూఢనమ్మకాలు, రహస్యాల 'దహన్'
2. దహన్ - రాకన్ కా రహస్య (Dahan: Raakan Ka Rahasya): ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.1 | ఓటీటీ: జియో హాట్‌స్టార్
2022లో వచ్చిన ఈ సిరీస్ ఒక విభిన్నమైన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్. శిలాస్పురా అనే ఒక మారుమూల గ్రామానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కొడుకుతో కలిసి బదిలీపై వస్తుంది. ఆ గ్రామంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. స్థానికులు దాన్ని ఒక శాపంగా భావిస్తారు. ఆ మూఢనమ్మకాల వెనుక ఉన్న నమ్మశక్యం కాని రహస్యాలను, సైన్స్ కోణాన్ని ఆ అధికారిణి ఎలా ఛేదించిందనేదే ఈ కథ.
మైండ్ గేమ్‌తో భయపెట్టే 'భ్రమ్'
3. భ్రమ్ (Bhram): IMDb రేటింగ్: 6.3 | ఓటీటీ: జీ5
{{/usCountry}}2022లో వచ్చిన ఈ సిరీస్ ఒక విభిన్నమైన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్. శిలాస్పురా అనే ఒక మారుమూల గ్రామానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన కొడుకుతో కలిసి బదిలీపై వస్తుంది. ఆ గ్రామంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. స్థానికులు దాన్ని ఒక శాపంగా భావిస్తారు. ఆ మూఢనమ్మకాల వెనుక ఉన్న నమ్మశక్యం కాని రహస్యాలను, సైన్స్ కోణాన్ని ఆ అధికారిణి ఎలా ఛేదించిందనేదే ఈ కథ.
మైండ్ గేమ్‌తో భయపెట్టే 'భ్రమ్'
3. భ్రమ్ (Bhram): IMDb రేటింగ్: 6.3 | ఓటీటీ: జీ5
{{/usCountry}}ఒక రోడ్డు ప్రమాదం తర్వాత మానసిక ప్రశాంతత కోసం అలీషా అనే యువతి షిమ్లాలోని తన సోదరి ఇంటికి మారుతుంది. అక్కడ ఆమెకు కొన్ని వింత ఆకారాలు, భయానక సంఘటనలు కనిపిస్తాయి. ప్రమాదం వల్ల కలిగిన భ్రాంతి (Hallucination) అని మొదట అనుకున్నా.. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న నిజాలు ఊహకందవు. ఆ వింత సంఘటనలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆమె ఎలాంటి ప్రమాదంలో పడిందనేది ఇందులో చూడవచ్చు.
స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో 'అధూర'
4. అధూర (Adhura): ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.6 | ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఊటీలోని ఒక ప్రతిష్టాత్మక బోర్డింగ్ స్కూల్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ స్కూల్‌కు వచ్చిన ఒక కొత్త అబ్బాయి చేష్టల వల్ల కొన్ని భయంకరమైన ఘోరాలు జరుగుతాయి. ఆ సంఘటనలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తాయి. కొన్ని ఏళ్ల తర్వాత 2007 బ్యాచ్‌కు చెందిన పాత విద్యార్థుల రీ-యూనియన్ వేడుక అదే స్కూల్‌లో జరిగినప్పుడు.. ఆ సంస్థ గతానికి సంబంధించిన ఒక చీకటి నిజం బయటకు వస్తుంది.
నాగ చైతన్య ఓటీటీ ఎంట్రీ 'ధూత'
5. ధూత (Dhootha): ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.7 | ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌లో ఒక జర్నలిస్ట్ జీవితంలో జరిగే వింత పరిణామాలు ఆకట్టుకుంటాయి. ఒక పాత న్యూస్ పేపర్‌లో రాబోయే వార్తలు ఆయన నిజ జీవితంలో ముందే జరిగిపోతుంటాయి. ఈ భవిష్యవాణి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనేది ప్రేక్షకులను చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసేలా చేస్తుంది.
మిలిటరీ క్యాంప్‌లో రాక్షసుడి వేట 'ఘూల్'
6. ఘౌల్ (Ghoul): ఐఎమ్‌డీబీ రేటింగ్: 7 | ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
ఒక రహస్య మిలిటరీ డిటెన్షన్ సెంటర్‌కు ఒక ప్రమాదకరమైన కొత్త ఖైదీ వస్తాడు. ఆయన వచ్చినప్పటి నుంచి అక్కడ వాతావరణం మారిపోతుంది. ఆ ఖైదీ చేసే వింత పనులు, మాట్లాడే మాటలు అక్కడి అధికారులను భయపెడతాయి. అరబిక్ జానపద కథల్లోని 'ఘౌల్' అనే నరమాంస భక్షక రాక్షసుడి ఆధారంగా ఈ మిని-సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్ హారర్ ప్రియులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.