Sign in

OTT Horror Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 3 వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్స్- ఈ మూడు కూడా డిఫరెంటే- ఎందుకంటే?

Friday OTT Horror Movies Release: ఓటీటీలోకి ఇవాళ వణుకుపుట్టించే మూడు క్రేజీ హారర్ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. పేరుకు హారర్ సినిమాలు అయినా 3 డిఫరెంట్ అంశాలతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటిని చూసేందుకు గల ఇంట్రెస్టింగ్ అంశాలపై లుక్కేద్దాం.

Published on: Jun 12, 2026, 15:07:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Horror Thriller Movies Release: థియేటర్లలో కంటే ఓటీటీ వేదికలపై హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. చీకటి పడ్డాక రూమ్ లైట్లన్నీ ఆపేసి, స్క్రీన్ ముందు కూర్చుని భయపడుతూ సినిమాలు చూడటం డిజిటల్ ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 3 వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్స్- ఈ మూడు కూడా డిఫరెంటే- ఎందుకంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 3 వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్స్- ఈ మూడు కూడా డిఫరెంటే- ఎందుకంటే?

ఇవాళ ఓటీటీలోకి 3 హారర్ థ్రిల్లర్స్

సరిగ్గా ఇదే వినోదాన్ని రెట్టింపు చేయడానికి ప్రముఖ ఓటీటీ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సరికొత్త ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలతో ఇవాళ (జూన్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న మూడు విభిన్నమైన హారర్ సినిమాల విశేషాలు, కథాంశాలు, చూసేందుకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటీ అనేవాటిపై ఒక లుక్కేద్దాం.

1. భూత్ బంగ్లా (Bhooth Bangla) – నెట్‌ఫ్లిక్స్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన క్రేజీ హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా'. 2007లో వచ్చిన క్లాసిక్ హిట్ 'భూల్ భులైయా' తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయి డిజిటల్ ఆడియన్స్‌ను అలరిస్తోంది.

కథ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్జున్ ఆచార్య (అక్షయ్ కుమార్) తన తాత ముత్తాతల కాలం నాటి పురాతన భవనాన్ని పరిశీలించడానికి మగల్‌పూర్ వెళ్తాడు. అక్కడ తన చెల్లెలి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఆ భవనానికి 'వధూసురుడు' అనే పురాణ రాక్షసుడి శాపం ఉంటుంది. ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన పెళ్లికూతుళ్లు మాయమైపోతుంటారు.

అస్సలు దయ్యాలను నమ్మని అర్జున్, ఆ బంగ్లాలో ఎలాంటి అతీత శక్తులను ఎదుర్కొన్నాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.

ఎందుకు చూడాలి?: అక్షయ్ కుమార్ క్లాసిక్ కామెడీ టైమింగ్, రాజ్‌పాల్ యాదవ్, పరేష్ రావల్ కామెడీ ట్రాక్ ఈ సినిమాకు ప్రధాన బలం. భయపెడుతూనే నవ్వించే ద్వితీయార్థం హారర్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది.

2. విజిల్ (Whistle) – అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు డబ్బింగ్)

హారర్ చిత్రాల దర్శకుడు కోరిన్ హార్డీ తెరకెక్కించిన హాలీవుడ్ సూపర్ నాచురల్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ 'విజిల్'. ఈ హాలీవుడ్ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో కలిపి అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ్టీ నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

కథ: కొందరు హైస్కూల్ విద్యార్థులకు అనుకోకుండా ఒక పురాతన అజ్టెక్ (Aztec) కాలం నాటి వింత విజిల్ దొరుకుతుంది. ఆ విజిల్ ఊదితే వచ్చే భయంకరమైన శబ్దం విన్నవారికి, భవిష్యత్తులో వారు ఎలా చనిపోతారో ఆ మృత్యువు రూపాలే వెంటాడి వేటాడటం ప్రారంభిస్తాయి.

ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతుండటంతో, బతికి ఉన్న మిత్రులు ఆ శపించబడిన పుర్రె విజిల్ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఎందుకు చూడాలి?: ఒక వింత శబ్దం చుట్టూ తిరిగే విభిన్నమైన కాన్సెప్ట్ ఇది. హాలీవుడ్ నటీమణులు డాఫ్నే కీన్, సోఫీ నెలిస్సే నటన, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. సరికొత్త మిస్టరీ హారర్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

3. దె విల్ కిల్ యూ (They Will Kill You) – హెచ్‌బీఓ మ్యాక్స్ & అమెజాన్ ప్రైమ్ (రెంటల్)

యాక్షన్, హారర్, డార్క్ కామెడీల కలయికతో హాలీవుడ్ దర్శకుడు కిరిల్ సోకోలోవ్ రూపొందించిన విభిన్నమైన చిత్రం 'దె విల్ కిల్ యూ'. ప్రస్తుతం ఈ చిత్రం హెచ్‌బీఓ మ్యాక్స్ (HBO Max) తో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: జైలు నుంచి విడుదలైన ఏషియా రీవ్స్ (జాజీ బీట్జ్) న్యూయార్క్ నగరంలోని ఒక విలాసవంతమైన హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో హౌస్‌కీపర్‌గా చేరుతుంది. అయితే ఆమె అక్కడికి వచ్చింది కేవలం పని కోసం కాదు. గతంలో అక్కడ చేరి కనిపించకుండా పోయిన తన సొంత చెల్లెలిని వెతకడానికి.

ఆ బిల్డింగ్‌లో నివసించే సంపన్న వర్గాలంతా ఒక భయంకరమైన సాతాను (Satanic Cult) అనే హంతక ముఠాగా ఏర్పడుతుంది. ఆ హంతక ముఠా నుంచి తన చెల్లెలిని కాపాడుకుని ఆమె ఎలా ప్రాణాలతో బయటపడింది అనేది రక్తం పారే యాక్షన్ సీన్లతో చూపించారు.

ఎందుకు చూడాలి?: కిల్ బిల్ సినిమా తరహా ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ కొరియోగ్రఫీ, క్లైమాక్స్ ట్విస్టులు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలుపుతాయి. హారర్‌తో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఇది బెస్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు.

మూడూ డిఫరెంట్‌గానే

ఇలా ఇవాళ 3 హారర్ థ్రిల్లర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ఇవి పేరుకు హారర్ సినిమాలు అయినా, కామెడీ, సైకలాజికల్ మిస్టరీ, హై వోల్టేజ్ యాక్షన్ వంటి మూడు డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో ఓటీటీలోకి వచ్చేశాయి. అలాగే, వీటిలో రెండు ఒక్క అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అవడం, అందులో ఒకటి తెలుగులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More