OTT Horror Thrillers Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 4 హారర్ థ్రిల్లర్స్- ఒకేదాంట్లో 3, తెలుగులో ఒక్కటే- ఇక్కడ చూసేయండి!

OTT Horror Thriller Movies Release Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు నాలుగు హారర్ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్ ఎలిమెంట్స్ ఉండి విభిన్న జోనర్లలో ఈ 4 మూవీస్ ఉన్నాయి. వీటిలో ఒకేదాంట్లో 3 ఓటీటీ రిలీజ్ కాగా తెలుగులో ఒక్కటే అందుబాటులో ఉంది. ఆ ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ ఏంటో లుక్కేద్దాం.

Apr 10, 2026, 12:38:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror Thriller Today: ఓటీటీలోకి ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ వేరు. ఇవాళ అంటే ఏప్రిల్ 10న 19 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయితే, అందులో నాలుగు హారర్ థ్రిల్లర్ సినిమాలు ఉండటం విశేషంగా మారింది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 4 హారర్ థ్రిల్లర్స్- ఒకేదాంట్లో 3, తెలుగులో ఒక్కటే- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 4 హారర్ థ్రిల్లర్స్- ఒకేదాంట్లో 3, తెలుగులో ఒక్కటే- ఇక్కడ చూసేయండి!

ఆ నాలుగులో కూడా 3 ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా వాటిలో ఒక్కటి మాత్రమే తెలుగులో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండి విభిన్న జోనర్లలతో నేడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కనిమంగళం కొవిలకమ్ ఓటీటీ

మలయాళంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం కనిమంగళం కొవిలకమ్. హారర్ జోనర్‌కు కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాలో అజ్మల్ ఖాన్ ఏఏ, అభి క్రిష్, ముహమ్మద్ రఫి, కొట్టాయం రమేష్, శరత్ సభా నటించారు. రాజేష్ మోహన్ కథ, దర్శకత్వం వహించారు.

శ్మశానం పక్కనే ఉన్న ఓ పాడుబడ్డ హాస్టల్‌లో దుష్ట శక్తులు, దెయ్యాలు ఉన్నాయని, ఆ హాస్టల్‌కి వెళ్లిన చనిపోతున్నారని కథలు వస్తుంటాయి. అవి విన్న కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఆ పాడుబడ్డ హాస్టల్‌లోకి వెళ్తారు. వారు ఎందుకు వెళ్లారు, అక్కడ వారు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటీ అనేదే కనిమంగళం కొవిలకమ్ సినిమా కథ.

నేడు కనిమంగళం కొవిలకమ్ ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్‌లో ఈరోజు నుంచి కనిమంగళం కొవిలకమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ ఒక్క ఓటీటీలోనే నేడు మూడు హారర్ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో థ్రాష్, తు యా మై రెండు హారర్ ఎలిమెంట్స్ ఉండే సర్వైవల్ థ్రిల్లర్స్ కాగా మరోటి స్క్రీమ్ 7 మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.

స్క్రీమ్ 7 ఓటీటీ

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో స్క్రీమ్ సిరీస్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్‌లో దారుణమైన రక్తపాతంతోపాటు కామెడీ ఎలిమెంట్స్ కూడా చూపించారు. ఇక తాజాగా వచ్చిన స్క్రీమ్7ను స్లాషల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో నేడు స్క్రీమ్ 7 ఓటీటీ రిలీజ్ అయింది.

తు యా మై ఓటీటీ

హిందీలో తెరకెక్కిన రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమానే తు యా మై. ఇద్దరు యూట్యూబర్ కపుల్స్ ప్రేమలో పడి టూర్‌కు వెళ్తున్న క్రమంలో ఓ హోటల్‌లో మొసలి బారిన పడతారు. దాని నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నదే కథ. నెట్‌ఫ్లిక్స్‌లోనే ఇవాళ్టీ నుంచి తు యా మై ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

థ్రాష్ ఓటీటీ

థ్రాష్ మూవీ కూడా దాదాపుగా తు యా మై సినిమా తరహాలోనే ఉంటుంది. అయితే, ఇందులో భయంకరమైన షార్క్స్ బారిన పడటమే కాకుండా భీబత్సమైన తుఫాన్ దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ సిటీలో అనుకోకుండా తుఫాన్ వస్తుంది. దాంతో నగరమంతా జలమయం అవుతుంది. అదే సమయంలో సముద్రంలోని షార్క్స్ మనుషులను వేటాడుతాయి.

తెలుగులో ఒక్కటి

మరి ఆ షార్క్స్, తుఫాన్ నుంచి ఆ ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోగలిగారా లేదా అనేదే థ్రాష్ కథ. నెట్‌ఫ్లిక్స్‌లో నేడు థ్రాష్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా థ్రాష్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా నేడు నాలుగు హారర్ థ్రిల్లర్స్ ఓటీటీ రిలీజ్ కాగా థ్రాష్ ఒక్కటి తెలుగులో అందుబాటులో ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More