Valentines Day OTT: ప్రేమ మాయలో.. వాలంటైన్స్ డే రోజు ఓటీటీలో చూడాల్సిన 5 డీప్ తెలుగు లవ్ స్టోరీస్ ఇవే.. ఓ లుక్కేయండి

ఈ రోజు వాలెంటైన్స్ డే. ప్రేమ నిండిన రోజు. ప్రేమికులకు పండగ రోజు. మరి ఇంకెందుకు లేట్.. లవర్స్, కపుల్స్ ఈ స్పెషల్ డేను ఓటీటీలో ఈ హార్ట్ టచింగ్ తెలుగు ప్రేమ సినిమాలతో మరింత స్పెషల్ గా మార్చుకోండి. ప్రేమ మాయలో మునిగిపోండి. 

Published on: Feb 14, 2026, 15:47:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రేమ.. అనిర్వచనీయమైన పదం ఇది. అర్థం చెప్పలేని అనుభూతి ఉంది. రెండు మనసులను కలిపే బంధం ఇది. ఒక్కో జనరేషన్ ఒక్కోలా మారుతున్నా, ఒక్కోలా పిలుస్తున్నా.. ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఈ రోజు వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14). ఈ స్పెషల్ రోజున మీ పార్టనర్ తో కలిసి ఓటీటీలో ఈ లవ్ స్టోరీలను చూసేయండి. మనసులో మరింత ప్రేమను నింపుకోండి.

వాాలెంటైన్స్ డే ఓటీటీ లిస్ట్ (x)
వాాలెంటైన్స్ డే ఓటీటీ లిస్ట్ (x)

సీతారామం

తెలుగు సినిమాల్లోని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీల్లో ‘సీతారామం’ ఒకటి అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా, ఇందులోని డైలాగ్ లు, ప్రేమ, క్లైమాక్స్.. ఇలా ప్రతీది అద్భుతమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించిన సీతారామం మాటల్లో వర్ణించలేని దృశ్య కావ్యం. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే. క్లైమాక్స్ లో మీ కళ్లు చెమర్చకుండా ఉండలేవు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది.

అర్జున్ రెడ్డి

తెలుగు సిని పరిశ్రమలోనే ఓ సంచలనం ‘అర్జున్ రెడ్డి’ మూవీ. ఇదో ట్రెండ్ సెట్టర్. లవ్, రొమాన్స్, కోపం.. ఇలా అన్నీ ఎక్స్ ట్రీమ్ గా చూపించిన సినిమా ఇది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీ ఓ క్లాసిక్. లవ్, రొమాన్స్, బోల్డ్, ఎమోషన్ సీన్లతో నిండిన ఈ సినిమా వాలెంటైన్స్ డే ఫర్ఫెక్ట్ మూవీ డేట్. ఇది జియోహాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఉంది.

జాను

మనలో చాలా మందికి స్కూల్, కాలేజీ రోజుల్లో కచ్చితంగా ఓ లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. మనం స్కూల్ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి 22 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ లో కలిస్తే ఎలా ఉంటుంది? ఆ ఎమోషన్లు ఎలా ఉంటాయి? అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన క్లీన్ లవ్ స్టోరీ ‘జాను’. ఇందులో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లు. తమిళ మూవీ 96కు రీమేక్ గా వచ్చిన ఈ ప్రేమ కథ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ఉంది.

ఫిదా

తెలంగాణ యాసతో, ఇక్కడి కల్చర్ తో బిగ్ స్క్రీన్ పై సెన్సేషనల్ గా నిలిచిన మూవీ ‘ఫిదా’. ఇదో అద్భుతమైన లవ్ స్టోరీ సినిమా. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి లీడ్ రోల్స్ ప్లే చేశారు. అమెరికాలో ఉండే అబ్బాయిని ప్రేమించినా.. కన్న తండ్రిని, ఉన్న ఊరును వదిలి వెళ్లలేని తెలంగాణ అమ్మాయి బాధ ఈ కథ. అది అర్థం చేసుకుని హీరోనే ఊరికి వచ్చేయడం హైలైట్. ఈ చిత్రం ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఏ మాయ చేశావె

తెలుగు సినిమాల్లో మరో అందమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘ఏ మాయ చేశావె’. తన కంటే వయసులో పెద్దదైన జెస్సీని కార్తీక్ లవ్ చేయడం, తండ్రి కోసం ఆ ప్రేమను అమ్మాయి త్యాగం చేయాలనుకోవడమనే కథతో వచ్చిన ఈ సినిమా తెలుగు తెరపై ఓ అద్భుతం. ఇందులో నాగ చైతన్య, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు సినీ చరిత్రలో జెస్సీ, కార్తీక్ క్యారెక్టర్లు ఎప్పటికీ నిలిచిపోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More