...
...
Next Story

Malayalam Horror Thrillers OTT: ఓటీటీలో వణుకు పుట్టించే మలయాళ హారర్ థ్రిల్లర్స్.. మిస్సవ్వకూడని ఓ సినిమా, సిరీస్

Malayalam Horror Thrillers OTT: మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సస్పెన్స్, హారర్ చిత్రాలకు ఓటీటీ ఆడియన్స్‌లో ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లేటెస్ట్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ రెండు బెస్ట్ మలయాళ హారర్ థ్రిల్లర్స్ ఓటీటీలో అదరగొడుతున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

Published on: Jul 05, 2026 06:39 PM IST
Advertisement

Malayalam Horror Thrillers OTT: హారర్, మిస్టరీ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి వీకెండ్ వినోదం కోసం సరికొత్త ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు గుండె గుభేల్మనేలా చేసే ఆ రెండు సరికొత్త మలయాళ కంటెంట్ వివరాలు ఇవే.

1. కరక్కం (Karakkam) — SonyLIV

ఓటీటీలో వణుకు పుట్టించే మలయాళ హారర్ థ్రిల్లర్స్.. మిస్సవ్వకూడని ఓ సినిమా, సిరీస్
ఓటీటీలో వణుకు పుట్టించే మలయాళ హారర్ థ్రిల్లర్స్.. మిస్సవ్వకూడని ఓ సినిమా, సిరీస్

శ్రీనాథ్ బాసి, ఫెమినా జార్జ్, ప్రవీణ్, అభిరామ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రల్లో నటించిన కరక్కం చిత్రం ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలోనే ఫస్ట్ మ్యూజికల్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది.

సినిమా కథ

కరక్కం మూవీ స్టోరీ డిఫరెంట్ గా ఉంది. అల్లరిచిల్లరిగా తిరిగే ధనుష్, ఖాజా అనే ఇద్దరు యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గొడవపడతారు. ఫుల్ గా తాగి పడుకోవడానికి చర్చి శ్మశాన వాటికకు వెళ్తారు. అక్కడి అయిదు సమాధులపై ఉన్న ఇత్తడి సిలువలను దొంగతనం చేస్తారు.

అప్పుడు ఆ అయిదు ఆత్మలు బయటకు వస్తాయి. అవి మ్యూజిక్, డ్యాన్స్ చేస్తూ కలర్ ఫుల్ గా ఉండే ఆత్మలు. ఈ ఆత్మలు కలిసి ధనుష్, ఖాజాను వెంబడిస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఆత్మల గతం ఏంటీ? అన్నది కరక్కం మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

ఎందుకు చూడాలి?

గాల్లో తేలే దెయ్యాలు కాకుండా, నటీనటుల సహజ సిద్ధమైన నటన, రియలిస్టిక్ లొకేషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిమ్మల్ని సీట్లో నుంచి కదలకుండా చేస్తుంది. దీనికి తోడు తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎలాంటి సబ్‌టైటిల్స్ ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూసేయవచ్చు.

2. ముత్తశ్శి (Muthassi) — ZEE5 (Web Series)

లీల అనే యువతి, రాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక శాపగ్రస్తమైన గ్రామంలో ఉండే వారి పాతకాలపు పెద్ద మేడలోకి కాపురానికి వస్తుంది. ఆ భయంకరమైన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే లీలకు ఎన్నో అనుమానాలు, వింత అనుభవాలు ఎదురవుతుంటాయి.

అదే సమయంలో.. ఒకప్పుడు ఆ ఊరిని శపించిన చేతబడి చేసే ‘ముత్తశ్శి’ భయంకరమైన రూపంతో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.లీలా గర్భం దాల్చి శ్రీకుట్టన్ అనే బాబు పుట్టిన తర్వాత.. ముత్తశ్శి ఆ బాబును తన తదుపరి వారసుడిగా చూస్తూ వింత పనులు చేయడం ప్రారంభించడంతో కథ మలుపు తిరుగుతుంది.

ఆ తర్వాత ఆ బాబు ప్రవర్తనలో అత్యంత భయానకమైన మార్పులు చోటుచేసుకోవడంతో లీల తీవ్ర ఆందోళనకు గురవుతుంది.చివరకు తన బిడ్డను కాపాడుకోవడానికి లీల ఆ ముత్తశ్శి వెనుక ఉన్న భయంకరమైన గతాన్ని, రహస్యాలను ఎలా ఛేదించింది అనేదే ఈ మిస్టికల్ ఫోక్ హారర్ కథ.

ఎందుకు చూడాలి?

కేరళ సాంప్రదాయ కట్టుబాట్లు, పాతకాలపు భవనాల్లో ఉండే గూస్‌బంప్స్ తెప్పించే వాతావరణాన్ని ఈ సిరీస్‌లో అద్భుతంగా చూపించారు. సాధారణ సినిమాల కంటే వెబ్ సిరీస్ కావడం వల్ల ప్రతి ఎపిసోడ్ ఎండ్‌లో ఇచ్చే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ట్విస్టులు 'నెక్స్ట్ ఏం జరుగుతుంది?' అనే క్యూరియాసిటీని పెంచుతాయి. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe