OTT: ఓటీటీ లవర్స్ కోసం క్రేజీ లిస్ట్.. జీ5లో తప్పక చూడాల్సిన 7 బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒక్కో మూవీ ఆణిముత్యమే!
OTT: ఓటీటీలో కంటెంట్ కు లోటు లేదు. వివిధ భాషల నుంచి సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో ఏ మూవీ చూడాలనేది అర్థం కావడం లేదా? అయితే ఈ బ్లాక్ బస్టర్ ఓటీటీ లిస్ట్ మీ కోసమే. జీ5లో ఉన్న ఈ టాప్ 7 సినిమాలపై ఓ లుక్కేయడి. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వందలాది సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ, మన మూడ్‌కు తగ్గ సరైన సినిమాను ఎంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. స్క్రీన్ పై గంటల తరబడి స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృథా చేసే బదులు, మిమ్మల్ని స్క్రీన్‌కు హత్తుకుపోయేలా చేసే కొన్ని అద్భుతమైన చిత్రాలను చూడటం ఎంతో మేలు. ప్రముఖ ఓటీటీ 'జీ5' (ZEE5) లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏడు టాప్ మూవీస్ ఏంటో ఇక్కడ చూసేయండి.

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (Uri: The Surgical Strike)
2016లో జరిగిన ఉరి ఉగ్రదాడి నేపథ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో మేజర్ విహాన్ సింగ్ షేర్‌గిల్ (విక్కీ కౌశల్) అనే ఆర్మీ ఆఫీసర్.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి సంరక్షణ కోసం డెస్క్ జాబ్ తీసుకుంటాడు. అయితే, ఉరిలోని ఆర్మీ బేస్‌పై పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు దాడి చేసి, విహాన్ బావమరిదితో సహా 19 మంది సైనికులను దారుణంగా హత్య చేస్తారు.
ఈ ఘటనతో రగిలిపోయిన విహాన్.. శత్రువులకు గుణపాఠం చెప్పేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో రహస్యంగా చేపట్టే సర్జికల్ స్ట్రైక్‌కు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతాడు. క్లిష్టమైన కొండ ప్రాంతాలు, పరిమిత సమయం, అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ విహాన్ బృందం ఈ మిషన్‌ను ఎలా పూర్తి చేసిందనేది ఈ సినిమా కథాంశం.
గజినీ (Ghajini)
సైకలాజికల్, రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'గజినీ' ఒక సంచలనం. సంజయ్ సింఘానియా (ఆమిర్ ఖాన్) అనే సంపన్న వ్యాపారవేత్తపై జరిగిన భీకర దాడిలో తీవ్రమైన తలగాయమై, ఆయన షార్ట్ టర్మ్ మెమరీ లాస్ (ప్రతి 15 నిమిషాలకు జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధి) బారిన పడతాడు.
తన కాబోయే భార్య కల్పన (అసిన్) ను దారుణంగా హత్య చేసిన ముఠాను అంతం చేయడానికి సంజయ్ తన శరీరంపై వేసుకున్న టాటూలు, ఫోటోలు, నోట్స్ ఆధారంగా వేట ప్రారంభిస్తాడు. శత్రువుల కోసం సంజయ్ సాగించిన ఈ రివేంజ్ ప్రయాణం వీక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది.
టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ (Toilet: Ek Prem Katha)
భారతదేశంలో పారిశుధ్యం, సామాజిక అవగాహన ప్రాముఖ్యతను తెలియజేసే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ యువకుడు కేశవ్ (అక్షయ్ కుమార్) ను వివాహం చేసుకున్న జయా (భూమి పెడ్నేకర్), ఆ ఇంట్లో మరుగుదొడ్డి లేదని తెలుసుకుని భర్తను విడిచిపెట్టి వెళ్తుంది. తన భార్యను తిరిగి తెచ్చుకోవడానికి కేశవ్ తన సొంత గ్రామంలో కట్టుబాట్లను నమ్మే వ్యవస్థపై పోరాటానికి దిగుతాడు.
కాక్‌టైల్ (Cocktail)
ప్రేమ, స్నేహం, ఎమోషనల్ రైడ్ గా వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం 'కాక్‌టైల్'. బాధ్యతలకు దూరంగా ఉండటానికిష్టపడే గౌతమ్ (సైఫ్ అలీ ఖాన్).. విలాసవంతమైన జీవితాన్ని గడిపే వెరోనికా (దీపికా పదుకొణే), సాంప్రదాయ కుటుంబానికి చెందిన మీరా (డియానా పెంటీ) అనే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోతాడు.
గదర్: ఏక్ ప్రేమ్ కథ (Gadar: Ek Prem Katha)
భారతదేశ విభజన నాటి విషాదకర నేపథ్యంతో రూపొందిన చారిత్రాత్మక ప్రేమకావ్యం 'గదర్'. దేశ విభజన అల్లర్లలో తన కుటుంబానికి దూరమైన ముస్లిం యువతి సకీనా (అమీషా పటేల్) ను తారా సింగ్ (సన్నీ డియోల్) అనే సిక్కు ట్రక్ డ్రైవర్ రక్షిస్తాడు. వారిద్దరూ వివాహం చేసుకుని భారతదేశంలో ప్రశాంతంగా జీవిస్తుంటారు.
అయితే, పాకిస్తాన్‌లో తన తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లిన సకీనాను, ఆమె తండ్రి బంధించి రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తాడు. దీంతో తన భార్యను, కొడుకు కోసం తారా సింగ్ సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టి సాగించే సాహసోపేతమైన పోరాటమే ఈ సినిమా.
ట్రాప్డ్ (Trapped)
ఒక మనిషి మనుగడ సాగించేందుకు చేసే సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ 'ట్రాప్డ్'. ముంబైలోని ఒక ఎత్తైన ఖాళీ అపార్ట్‌మెంట్‌లో అనుకోకుండా చిక్కుకుపోయిన శౌర్య (రాజ్‌కుమార్ రావ్) అనే కాల్ సెంటర్ ఉద్యోగి కథ ఇది. కరెంట్, నీరు, ఆహారం లేని ఆ మూసిఉన్న గది నుంచి బయటపడటానికి శౌర్య చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ నీరసించిపోయే శౌర్య, ప్రాణాలను కాపాడుకోవడానికి తన సహజ సిద్ధమైన తెలివితేటలతో ఎలా పోరాడాడనేది ఊపిరి బిగబట్టి చూసేలా ఉంటుంది.
ఆర్‌ఆర్‌ఆర్ (RRR)
స్వాతంత్య్రానికి పూర్వం నాటి కథాంశంతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చెక్కిన దృశ్య కావ్యం 'ఆర్‌ఆర్‌ఆర్'. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్), గోండ్ తెగ వీరుడు కొమురం భీమ్ (ఎన్టీఆర్) పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వేర్వేరు లక్ష్యాలతో బయలుదేరిన ఈ ఇద్దరు యోధులు ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారు, వారి మధ్య కుదిరిన ప్రాణస్నేహం బ్రిటిష్ రక్కసులపై పోరాటానికి ఎలా దారితీసిందనేది బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


