దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఇది బాలకృష్ణ హిట్ సినిమా 'భగవంత్ కేసరి' రీమేక్ అనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో జనాలు అసలు కథ ఏంటో తెలుసుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'భగవంత్ కేసరి'ని ఎగబడి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
అమెజాన్ ప్రైమ్‌లో 'భగవంత్ కేసరి' హవా

జనవరి 9న థియేటర్లలోకి వస్తున్న 'జన నాయగన్' సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది బాలయ్య సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అని ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ట్రైలర్ చూసాక అవి నిజమే అనిపిస్తుండటంతో.. నెటిజన్లు కంపారిజన్ మొదలుపెట్టారు.
విజయ్ సినిమా క్రేజ్ వల్ల బాలయ్య సినిమాకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డ్రామా మూవీస్ కేటగిరీలో 'భగవంత్ కేసరి' ప్రస్తుతం ఒకటో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా.. ఒక మాజీ ఖైదీ తన దత్తపుత్రికను ఆర్మీలో చేర్పించడానికి పడే తపన, మధ్యలో ఒక బిజినెస్ మ్యాన్‌తో గొడవ చుట్టూ తిరుగుతుంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి రియాక్షన్
తన సంక్రాంతి సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' ప్రెస్ మీట్‌లో.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని "విజయ్ సినిమా మీ సినిమాకు రీమేకా?" అని అడగగా అతడు స్పష్టంగా సమాధానం చెప్పలేదు.
"విజయ్ గారు ఒక సూపర్బ్ జెంటిల్మెన్. ఇది ఆయన చివరి సినిమా. కాబట్టి నా సినిమాకు ఇందులో ఏదైనా పాత్ర ఉందా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. వాళ్లు కథను ఎలా ట్రీట్ చేశారో చూశాక మాట్లాడటం కరెక్ట్. అప్పటిదాకా దీన్ని రీమేక్ అని పిలవొద్దు.. ఇదొక దళపతి విజయ్ సినిమా" అని అనిల్ క్లారిటీ ఇచ్చాడు.
'జన నాయగన్' విశేషాలు
{{/usCountry}}"విజయ్ గారు ఒక సూపర్బ్ జెంటిల్మెన్. ఇది ఆయన చివరి సినిమా. కాబట్టి నా సినిమాకు ఇందులో ఏదైనా పాత్ర ఉందా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. వాళ్లు కథను ఎలా ట్రీట్ చేశారో చూశాక మాట్లాడటం కరెక్ట్. అప్పటిదాకా దీన్ని రీమేక్ అని పిలవొద్దు.. ఇదొక దళపతి విజయ్ సినిమా" అని అనిల్ క్లారిటీ ఇచ్చాడు.
'జన నాయగన్' విశేషాలు
{{/usCountry}}జన నాయగన్ సినిమాలో దళపతి విజయ్, మమితా బైజు (శ్రీలీల పాత్రలో నటిస్తున్నట్లు టాక్), పూజా హెగ్డే, బాబీ డియోల్ లాంటి వాళ్లు నటించారు. తెలుగులో 'జన నాయకుడు' పేరుతో, హిందీలో 'జన్ నేత' పేరుతో రిలీజ్ అవుతోంది.
విజయ్ తన పార్టీ 'టీవీకే' ద్వారా రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న ఆఖరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బుక్‌మైషోలో మాత్రం దీని లైన్ "అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఎదిగే నిజమైన నాయకుడు" అని రాసి ఉంది.