Bhagyaraj Dog: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు, నటుడు, స్క్రీన్‌ప్లే రైటర్ కె. భాగ్యరాజ్ (73) శనివారం (జూన్ 27, 2026) ఉదయం చెన్నైలో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్తతో కోలీవుడ్, టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పెంపుడు కుక్క భాగ్యరాజ్ శవపేటిక దగ్గర తిరుగుతున్న వీడియో మనసులను కలచివేస్తోంది.
ఆ మూగజీవి వేదన

లెజండరీ భాగ్యరాజ్ ఇక లేరు. ఆయన అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, అభిమానుల కోసం భాగ్యరాజ్ పార్థివ దేహాన్ని ఇంటి దగ్గర ఉంచారు. అప్పుడే ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క ఆ శవపేటిక దగ్గర తిరుగుతూ, తన యజమాని భౌతికకాయం వైపు చూస్తూ మూగ వేదనను వ్యక్తపరిచిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. మానవుల కంటే జంతువుల విశ్వాసం గొప్పదనేలా ఆ దృశ్యం సాగింది.
ఆ పెంపుడు కుక్క కళ్లు కూడా కన్నీటితో తడిచాయి. ఈ ఫొటోలు, వీడియోలు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. తన యజమానిని అలా చూసి ఆ పెంపుడు జంతువు బాధ పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తమిళనాడు సీఎం విజయ్ నివాళి
భాగ్యరాజ్ భౌతిక కాయానికి సినీ దిగ్గజాలు నివాళి అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులను (సతీమణి పూర్ణిమ, కుమారుడు శాంతను) ఓదార్చారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు.
విలపించిన సినీ లోకం
{{/usCountry}}భాగ్యరాజ్ భౌతిక కాయానికి సినీ దిగ్గజాలు నివాళి అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులను (సతీమణి పూర్ణిమ, కుమారుడు శాంతను) ఓదార్చారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు.
విలపించిన సినీ లోకం
{{/usCountry}}భాగ్యరాజ్ మరణ వార్త విని తమిళ, తెలుగు సెలబ్రిటీలు షాక్ అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ (తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు), నయనతార, విఘ్నేష్ శివన్, శివకార్తికేయన్, రాధికా శరత్‌కుమార్ వంటి ఎందరో ప్రముఖులు ఆయన నివాసానికి తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.
చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
కేవలం రెండు రోజుల క్రితమే గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకలో అందరితో కలిసి ఎంతో సంతోషంగా గడిపిన భాగ్యరాజ్.. ఇలా హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్లిపోవడం నమ్మలేకపోతున్నామంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
ముగిసిన అంత్యక్రియలు
భాగ్యరాజ్ అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమం జరిగింది. భాగ్యరాజ్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప "స్క్రీన్‌ప్లే కింగ్" ను కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.