BMW OTT: ఓటీటీలో రవితేజ మూవీ మరో మైల్‌స్టోన్.. ఆరు రోజుల్లోనే రికార్డు వ్యూస్.. డిజిటల్ స్పేస్‌లో అదిరే రెస్పాన్స్

BMW OTT: రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీలో దూసుకెళ్తోంది. తాజాగా జీ5 ఓటీటీలో మరో మైలురాయిని అందుకుంది. 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును ఈ కామెడీ డ్రామా దాటడం విశేషం.

Published on: Mar 19, 2026, 16:42:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ ప్రేక్షకులను ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోంది రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి. థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మాత్రం భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఒక రేర్ మైలురాయిని చేరుకుంది.

BMW OTT: ఓటీటీలో రవితేజ మూవీ మరో మైల్‌స్టోన్.. ఆరు రోజుల్లోనే రికార్డు వ్యూస్.. డిజిటల్ స్పేస్‌లో అదిరే రెస్పాన్స్
BMW OTT: ఓటీటీలో రవితేజ మూవీ మరో మైల్‌స్టోన్.. ఆరు రోజుల్లోనే రికార్డు వ్యూస్.. డిజిటల్ స్పేస్‌లో అదిరే రెస్పాన్స్

భర్త మహాశయులకు విజ్ఞప్తి 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీ తాజాగా గురువారం (మార్చి 19) అనౌన్స్ చేసిన డీటెయిల్స్ ప్రకారం.. ఈ ఫన్ రైడ్ ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను క్రాస్ చేసి ట్రెండ్ సెట్ చేసింది. అంటే జనాలకు ఈ మూవీ ఎంతలా కనెక్ట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు.

"ఈ ముగ్గురితో ఫన్, గందరగోళం, అయోమయం.. అలాగే ఏమాత్రం తగ్గని ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడూ ఉంటుంది" అంటూ మేకర్స్ ఒక సూపర్ అప్‌డేట్‌ను తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. నిజంగానే ఆ పోస్ట్‌లో చెప్పినట్లు సినిమాలో రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ క్రియేట్ చేసిన ఫన్, ఆ గందరగోళం చూస్తే ఎవరైనా సరే పగలబడి నవ్వాల్సిందే.

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి స్టోరీ

రామ్ సత్యనారాయణ (రవితేజ), బాలమణి (డింపుల్ హయాతి) భార్యాభర్తలు. చాలా అన్యోన్యంగా, ఎంతో ప్రేమగా ఉంటారు. వీరికి అనార్కలి అనే వైన్ బ్రాండ్ కంపెనీ ఉంటుంది. వ్యాపార నిమిత్తం స్పెయిన్‌కు వెళ్తాడు రామ్. అక్కడ పరిచయం అయిన మానస శెట్టి (ఆషిక రంగనాథ్)తో రామ్ ఫిజికల్ రిలేషన్‌షిప్‌ పెట్టుకుంటాడు.

తనకు పెళ్లయిన విషయాన్ని మానస దగ్గర, ఎఫైర్ గురించి భార్య బాలమణి దగ్గర దాస్తాడు రామ్. ఆ తర్వాత ఏమైంది? భార్యకు, ప్రియురాలికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి తంటాలు పడ్డాడు? పరాయి స్త్రీతో తన భర్త శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బాలామణి ఏం చేసింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే? భర్త మహాశయులకు విజ్ఞప్తి చూడాల్సిందే.

ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి..

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమా సంక్రాంతికి రిలీజైంది. జనవరి 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే మార్చి 13న ఓటీటీలోకి వచ్చింది. నిజానికి ఫిబ్రవరి 13నే వస్తుందని భావించారు. కానీ నెల రోజులు ఆలస్యమైంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు చాలానే ఎదురు చూశారు. ఇప్పుడు వచ్చీ రాగానే ఎగబడి చూస్తున్నట్లు 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు చూస్తే అర్థమవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More