OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన రవితేజ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. రెండు నెలల తర్వాత.. భార్య, గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగే భర్త
Bhartha Mahasayulaku Wignyapthi Ott: ఎట్టకేలకు రవితేజ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి 2026 రేసులో పోటీపడ్డ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
సంక్రాంతి 2026 రేసులో తలపడ్డ సినిమాలన్నీ ఎప్పుడో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. కానీ రవితేజ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మాత్రం ఇప్పటికి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. వివిధ కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ, ఎట్టకేలకు ఇవాళ డిజిటల్ డెబ్యూ చేసింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (మార్చి 13) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 తెలుగులో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను ఓటీటీలో చూడొచ్చు.
రెండు నెలల తర్వాత
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి 2026 బరిలో నిలిచింది. జనవరి 13న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సరిగ్గా రెండు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టింది. మార్చి 13 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ హీరో. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు.
మళ్లీ షాక్
మాస్ మహరాజ్ రవితేజకు వరుసగా షాక్ లు తప్పడం లేదు. ఆయన కెరీర్ లో ఇప్పుడు వరుసగా ఫ్లాఫ్ లు ఎదురవుతున్నాయి. దీంతో రూట్ మార్చి, మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చేశాడు. అయినా కలిసి రాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. ఈ మూవీకి కిషోర్ తిరుమల డైరెక్టర్.
భర్త మహాశయులకు విజ్ఞప్తి స్టోరీ
రామ్ సత్యనారాయణ (రవితేజ), బాలమణి (డింపుల్ హయాతి) భార్యాభర్తలు. చాలా అన్యోన్యంగా, ఎంతో ప్రేమగా ఉంటారు. వీరికి అనార్కలి అనే వైన్ బ్రాండ్ కంపెనీ ఉంటుంది. వ్యాపార నిమిత్తం స్పెయిన్‌కు వెళ్తాడు రామ్. అక్కడ పరిచయం అయిన మానస శెట్టి (ఆషిక రంగనాథ్)తో రామ్ ఫిజికల్ రిలేషన్‌షిప్ పెట్టుకుంటాడు.
తనకు పెళ్లయిన విషయాన్ని మానస దగ్గర, ఎఫైర్ గురించి భార్య బాలమణి దగ్గర దాస్తాడు రామ్. ఆ తర్వాత ఏమైంది? భార్యకు, ప్రియురాలికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి తంటాలు పడ్డాడు? పరాయి స్త్రీతో తన భర్త శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బాలామణి ఏం చేసింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే? భర్త మహాశయులకు విజ్ఞప్తి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


