...
...
Next Story

OTT Trending: థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో మాత్రం ఎగబడి చూసేస్తున్న జనాలు.. ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా తెలుగు సినిమా

OTT Trending: థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. థియేటర్లలో ఈ మూవీని పట్టించుకోని జనాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఎగబడి చూసేస్తున్నారు.

Published on: Mar 17, 2026, 10:06:02 IST
Advertisement

థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా దూసుకెళ్తోంది. బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపని ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం ఎగబడి చూసేస్తున్నారు. ఆ తెలుగు సినిమానే.. ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో బొక్కబోర్లా పడ్డ సంగతి తెలిసిందే.

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ఓటీటీ

ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ గా తెలుగు మూవీ (x/zee5telugu)
ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ గా తెలుగు మూవీ (x/zee5telugu)

రవితేజ హీరోగా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. మిక్స్ డ్ టాక్ వచ్చిన ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 13 నుంచి జీ5 తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది.

ఓటీటీ ట్రెండింగ్

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. ఈ ఇద్దరితో రవితేజ రొమాన్స్ చేస్తాడు. భార్య, గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఇరుక్కుపోయిన భర్తగా రవితేజ నటించాడు. అయితే ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు. కొత్తగా ఏం లేకపోవడంతో జనాలు ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

నంబర్ వన్

జీ5 ఓటీటీలో భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీ అదరగొడుతోంది. మార్చి 13న ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ మూవీకి కిశోర్ తిరుమల డైరెక్టర్. థియేటర్లలో రిలీజైన రెండు నెలలకు ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి స్టోరీ

తనకు పెళ్లయిన విషయాన్ని మానస దగ్గర, ఎఫైర్ గురించి భార్య బాలమణి దగ్గర రామ్ దాస్తాడు. ఆ తర్వాత ఏమైంది? భార్యకు, ప్రియురాలికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి తంటాలు పడ్డాడు? పరాయి స్త్రీతో తన భర్త శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బాలామణి ఏం చేసింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks