థియేటర్లలో సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా ఓటీటీలోకి దాదాపుగా 20 నుంచి 2, 3 నెలల్లోపు స్ట్రీమింగ్‌కు వస్తాయి. అలాగే, ఓటీటీ రిలీజ్ అనంతరం సుమారు నెల దాటిన తర్వాతే టీవీ ప్రీమియర్ అవుతుంటాయి. అలాంటిది ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 9 రోజుల్లోనే తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా బుల్లితెరపై సందడి చేయనుంది.
ఓటీటీ రిలీజైన 6 రోజులకు

అది కూడా ఓటీటీ రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన మూవీ అవడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ సినిమా మరేదో కాదు మాస్ మహరాజా రవితేజ ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటించిన ఫ్యామిలీ కామెడీ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.
ఇద్దరు హీరోయిన్స్
కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైంది. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా బాగానే టాక్ తెచ్చుకుంది.
స్పెయిన్‌లో లవ్ ఎఫైర్
రామ్ (రవితేజ) వైన్ కంపెనీ ఓనర్. తన భార్య బాలామణి (డింపుల్ హయాతి)తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. రామ్ కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ రామ్‌కి మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయం అవుతుంది. రామ్, మానస దగ్గర సత్యగా పరిచయం అవుతాడు. ఇద్దరూ ఒక్కటవుతారు.
సత్య లైఫ్ ఎలా మారింది
అనుకోకుండా జరిగిన ఆ తప్పు రామ్ అలియాస్ సత్య లైఫ్‌ను ఎలా మార్చింది?, రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి?, మానస విషయం బాలామణికి తెలిసిందా? చివరకు రామ్ ఇద్దర్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే భర్త మహాశయులకు విజ్జప్తి సినిమా చూడాల్సిందే.
ఓటీటీ ట్రెండింగ్‌లో
సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీలో ప్రస్తుతం ట్రెండింగ్‌లోనే ఎంటర్టైన్ చేస్తుంది. మార్చి 13న జీ5లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ అయింది. ఆ తర్వాత 6 రోజుల్లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీవీ ప్రీమియర్
{{/usCountry}}సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీలో ప్రస్తుతం ట్రెండింగ్‌లోనే ఎంటర్టైన్ చేస్తుంది. మార్చి 13న జీ5లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ అయింది. ఆ తర్వాత 6 రోజుల్లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీవీ ప్రీమియర్
{{/usCountry}}ఇప్పుడు కేవలం తొమ్మిది రోజుల్లోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి టీవీ ప్రీమియర్ కానుంది. ఇవాళ అంటే మార్చి 22న జీ తెలుగు ఛానెల్‌లో భర్త మహాశయులకు విజ్ఞప్తి బుల్లితెరపై సందడి చేయనుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు ఆడియెన్స్‌కు భర్త మహాశయులకు విజ్ఞప్తి జీ తెలుగులో అందుబాటులోకి రానుంది.
జీ తెలుగు ఛానెల్‌లో
ఆసక్తికరమైన కథాంశం, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని తప్పకుండా చూసేయండి అంటూ జీ తెలుగు ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్, ఓటీటీలో మిస్ అయిన వారు ఇంట్లో కూర్చుని ఎంచక్కా టీవీలో ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్‌లో చూసేయండి.