భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విటర్ రివ్యూ-సెకండాఫ్‌లో అదిరిన కామెడీ-రొటీన్ స్టోరీ-గ్లామరస్‌గా ఇద్దరు హీరోయిన్లు
సంక్రాంతి 2026కు మరో సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇవాళ రవితేజ హీరోగా యాక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో సినిమా ఎలా ఉందో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ ట్విటర్ రివ్యూపై ఓ లుక్కేయండి.
వరుసగా మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లతో, రొటీన్ స్టోరీలతో పెద్ద దెబ్బే తిన్నాడు రవితేజ. ఆయనకు వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి. ఇప్పుడు హిట్ కోసం రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ థియేటర్లకు వచ్చాడు. సంక్రాంతి 2026 సందర్బంగా ఇవాళ (జనవరి 13) రిలీజైంది ఈ మూవీ. మరి ట్విటర్ రివ్యూలో ఎలా ఉందో చూద్దాం.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విటర్ రివ్యూ
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రీమియర్స్ విదేశాల్లో ముగిశాయి. సినిమా చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తున్నారు. మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ స్లోగా ఉందని కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్ కారణంగా మూవీని ఒకసారి చూడొచ్చని పోస్టులు పెడుతున్నారు.
ఇద్దరు భామలతో
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో రొమాన్స్ చేశాడు. ఈ మూవీలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. ఇందులో రవితేజ భార్యగా డింపుల్ హయాతి, ప్రేయసిగా ఆషికా రంగనాథ్ నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి కిశోర్ తిరుమల డైెరెక్టర్.
రొటీన్ స్టోరీ
మరోసారి రొటీన్ స్టోరీతో రవితేజ వచ్చాడని ఓ యూజర్ ఎక్స్ లో పోస్టు చేశాడు. ‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కొన్ని కామెడీ బ్లాక్స్ తో కూడిన ఎంటర్ టైనర్. చాలా సార్లు చూసిన స్టోరీ, స్క్రీన్ ప్లేతోనే మూవీ వచ్చింది. డైరెక్టర్ కిశోర్ తిరుమల డెలివర్ చేసిన కొన్ని కామెడీ బ్లాక్స్ వర్కౌటయ్యాయి. క్లైమాక్స్ వీక్. రవితేజ గత కొన్ని సినిమాలతో పోల్చి చూస్తే ఇది కాస్త బెటర్. రేటింగ్ 2.25-2.5/5’’ అని పేర్కొన్నాడు.
కామెడీ కెమిస్ట్రీ
‘‘ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే ఓ మగాడి పాత కథతోనే సినిమా వచ్చింది. రవితేజ, వెన్నెల కిశోర్, సునీల్ మధ్య కెమిస్ట్రీ కారణంగా కామెడీ పనిచేసింది. పాటలు బాగున్నా ప్లేస్ మెంట్ బాలేదు. క్లైమాక్స్ అంతంతే’’ అని ఓ యూజర్ పోస్టు చేశాడు.
‘‘రవన్న ఎనర్జీ.. వెన్నెల, సత్య కలిసి మూవీని కాపాడారు. పాటలు ఓకే. కామెడీ బాగుంది’’ అని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఫస్ట్ హాఫ్
‘‘ఫస్ట్ హాప్ యావరేజ్. స్లోగా సినిమా మొదలైంది. ఆషికా గ్లామర్ తో మంట పుట్టించింది. సునీల్ ఎపిపోడ్స్ హిలేరియస్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది’’ అని ఓ నెటిజన్ పోస్టు చేశాడు.
‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓ డీసెంట్ మూవీ. స్టోగా స్టార్ట్ అయి సెకండాఫ్ లో పుంజుకుంది. రవితేజ ఎనర్జీ, ఆషికా గ్లామర్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సినిమాలో క్యూటెస్ట్ పార్ట్ అషికానే. డింపుల్ హయాతి, సత్య అంచనాలను అందుకోలేకపోయారు. ఓవరాల్ గా చూస్తే జస్ట్ ఓకే’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


