Bhogi Movie Review In Telugu:

టైటిల్: భోగి
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, శరత్ లోహితాశ్వ, లాల్, ఆడుకాలం నరేన్, దయానంద్ రెడ్డి, రోహిత్ పాఠక్, అవినాష్ తదితరులు
దర్శకత్వం: సంపత్ నంది
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్ ఏ
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: కె.కె. రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
విడుదల తేది: 27 నవంబర్ 2026
వరుస ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్, మాస్ కమర్షియల్ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో వచ్చిన పీరియాడిక్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా సినిమా 'భోగి'. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు.
కె.కె. రాధామోహన్ నిర్మించిన భోగి సినిమా ఇవాళ (నవంబర్ 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రూరల్ యాక్షన్ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి భోగి మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ ఏంటంటే?
1960 నాటి కాలంలో ఆదిలాబాద్ గిరిజన ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గులగుట్ట అనే కల్పిత గ్రామంలో ఊరి పటేల్ (శరత్ లోహితస్వ) చెప్పిందే రాజ్యంగా నడుస్తుంది. ఆయనకు ఎదురు మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతో గ్రామస్తులు బతుకుతుంటారు. అదే ఊరిలో కమ్మరి గంగ (శర్వానంద్) ఐదుగురు అక్కాచెల్లెళ్లతో, కుటుంబమే జీవితంగా, సాధారణ శ్రామికుడిగా బతుకుతాడు.
అలాంటి గంగ.. పటేల్‌కు ఎందుకు ఎదురుతిరిగాడు? ఊరి జనం కోసం అంటూ పటేల్ చేసే చీకటి కార్యాలు ఏంటీ? ఈ క్రమంలో గంగ ప్రేమించిన సులోచన (అనుపమ పరమేశ్వరన్) పాత్ర ప్రాధాన్యత ఏంటీ? చివరికి పటేల్ ఆధిపత్యాన్ని అణచివేశాడా పటేల్‌పై గంగ ప్రతీకారం తీర్చుకున్నాడా? అనేది తెలియాలంటే? భోగి సినిమా చూడాస్సిందే.
శర్వానంద్ నటన, పాటలే ప్రధాన బలం
{{/usCountry}}అలాంటి గంగ.. పటేల్‌కు ఎందుకు ఎదురుతిరిగాడు? ఊరి జనం కోసం అంటూ పటేల్ చేసే చీకటి కార్యాలు ఏంటీ? ఈ క్రమంలో గంగ ప్రేమించిన సులోచన (అనుపమ పరమేశ్వరన్) పాత్ర ప్రాధాన్యత ఏంటీ? చివరికి పటేల్ ఆధిపత్యాన్ని అణచివేశాడా పటేల్‌పై గంగ ప్రతీకారం తీర్చుకున్నాడా? అనేది తెలియాలంటే? భోగి సినిమా చూడాస్సిందే.
శర్వానంద్ నటన, పాటలే ప్రధాన బలం
{{/usCountry}}ఈ భారీ యాక్షన్ డ్రామాకు శర్వానంద్ వన్ మ్యాన్ షోలా నిలిచాడు. కథపై ఉన్న నమ్మకంతో తన లుక్ పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో కష్టపడ్డాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ తన పరిణతి చెందిన నటనతో మెప్పించాడు. ప్రథమార్ధంలోని కొన్ని సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద శైలి పాటలు థియేటర్లో మంచి జోష్ నింపాయి. డింపుల్ హయాతి తన పాత్ర పరిధి మేరకు మెరిశారు. అనుపమ పరమేశ్వరన్, హీరో చెల్లెళ్లుగా నటించిన ప్రణవి మానుకొండ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
రొటీన్ కథనం, మితిమీరిన హింస మైనస్
'భోగి' సింపుల్‌గా చెప్పాలంటే ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామా. దాంతో కథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. సినిమాలో చూపించిన ఆచారాలు, కట్టుబాట్లు గతంలో చాలా చిత్రాల్లో చూసినవే కావడంతో కథనం కొంతవరకు ఆసక్తికరంగా సాగదు. తర్వాతి సన్నివేశం ఎలా ఉండబోతోందో ప్రేక్షకులు ముందే ఊహించేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది.
ఇక సెకండాఫ్‌లో వయోలెన్స్ బాగున్నప్పటికీ కాస్తా శ్రుతిమించిన ఫీలింగ్ కలుగుతుంది. తలలు నరకడం, శరీర భాగాలు తెగిపడటం వంటి రక్తపాత దృశ్యాలు పదేపదే రిపీట్ అవడం విసుగుతెప్పిస్తుంది. కానీ, ఫస్టాఫ్‌లో, కొన్ని చోట్ల వచ్చే బీజీఎమ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ మెప్పించేలా ఉంటుంది. కొన్ని పాటలు, డైలాగ్స్, క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి.
సాంకేతిక విభాగం పనితీరు
కిషోర్ కుమార్ ఏ సినిమాటోగ్రఫీ ఆదిలాబాద్ ప్రకృతి అందాలను, పీరియడ్ వాతావరణాన్ని చక్కగా బంధించింది. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదు. భీమ్స్ సిసిరోలియో అందించిన జానపద పాటలు, వాటి చిత్రీకరణ ఆకట్టుకున్నాయి.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కానీ రచయితగా, దర్శకుడిగా సంపత్ నంది తన మార్క్ చూపించడంలో కాస్తా తడబడ్డారు. ఫైనల్‌గా చెప్పాలంటే శర్వానంద్ కష్టం, కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్, అదిరిపోయే ఆర్ట్ వర్క్, భీమ్స్ పాటలతో భోగి మూవీపై ఓసారి లుక్కేయవచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.