CBFC Titles: సినిమా టైటిళ్లపై సెన్సార్ బోర్డు పెత్తనం- ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర ఆగ్రహం- అనుపమ పరమేశ్వరన్ మూవీ గుర్తు చేస్తూ!
CBFC Titles Change Advisory Controversy: సినిమా టైటిళ్లు, విడుదల తేదీలపై సెన్సార్ బోర్డు ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకునేలా తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలపై చిత్ర పరిశ్రమ మండిపడుతోంది. కేరళ ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ఈ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టపోరాటానికి సిద్ధమవుతున్నాయి.
CBFC Titles Change Advisory Controversy: కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు దేశీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రచార చిత్రాలు విడుదల చేసినా, మార్కెటింగ్ పూర్తి చేసినా చివరి నిమిషం వరకు సినిమా టైటిల్, విడుదల తేదీ ఖరారైనట్లు భావించకూడదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.

అధికార పరిధిని దాటి
ఈ కొత్త ఆదేశాలపై దక్షిణాది చిత్రసీమ, ముఖ్యంగా కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డు తన అధికార పరిధిని మించి ప్రవర్తిస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండగా ఈ పెత్తనం ఏంటి?
సినిమా పేరును ఖరారు చేయడం వెనుక పెద్ద కసరత్తే ఉంటుందని కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అనిల్ థామస్ తెలిపారు. ప్రతి సినిమా శీర్షికను రిజిస్టర్ చేసే ముందు దేశంలోని అన్ని ఫిల్మ్ ఛాంబర్లతో చర్చించి, గతంలో ఆ పేరు ఎవరైనా వాడారా లేదా అనే విషయం సరిచూసుకుంటామని ఆయన వివరించారు. సమాజంలో ఎవరి భావాలూ దెబ్బతినకుండా, అసభ్యతకు తావులేకుండా పరిశీలించిన తర్వాతే టైటిల్స్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
"కేంద్ర సెన్సార్ బోర్డు ఇప్పటికే సినిమాలపై తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకుంటోంది. ఇప్పుడు ఏకంగా సినిమాల పేర్లపై కూడా పూర్తి నియంత్రణ సాధించాలని చూడటం తగదు. బోర్డు తన అధికారాలను అనవసరంగా విస్తరించుకుంటోంది" అని అనిల్ థామస్ మండిపడ్డారు.
ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం
సినిమా టైటిల్ అనేది కేవలం పేరు మాత్రమే కాదని, అది ఆ చిత్ర వ్యాపార గుర్తింపుకు మూలస్తంభమని ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాజేష్ అభిప్రాయపడ్డారు. ఒక సినిమా తీసి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన తర్వాత విడుదలకి రెండు రోజుల ముందు పేరు మార్చమంటే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళలోనే ఏడాదికి కనీసం 200 సినిమాలు విడుదలవుతుంటాయని, వాటన్నింటికీ టైటిల్ ఖరారు కాకుండానే ప్రచారం చేసుకోవడం సాధ్యపడదని చెప్పారు. "రచయిత రాసే కథలాగే సినిమా టైటిల్ కూడా ఒక కళాత్మక అభివ్యక్తి. ప్రచారమంతా ఒక పేరుతో నిర్వహించి, థియేటర్లలోకి వచ్చే ముందు టైటిల్ మార్చమంటే ఆ ప్రాజెక్ట్ ఆర్థికంగా తీవ్ర దెబ్బతింటుంది" అని రాజేష్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి పీసీ విష్ణునాథ్‌ను కలిసి విన్నవించాలని, స్పందన లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సినీ వర్గాలు నిర్ణయించారు. గతంలో కూడా సెన్సార్ బోర్డు ఇలాంటి ఆంక్షలతో పలు సినిమాలకు ఇబ్బందులు సృష్టించింది.
'జానకి' వివాదం నుంచి నేర్చుకున్న పాఠాలు
సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా సమయంలో తీవ్ర వివాదం నెలకొంది. రామాయణంలోని సీతాదేవిని గుర్తుచేసేలా 'జానకి' పేరు ఉందనే సాకుతో టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు మౌఖికంగా ఆదేశించింది.
ఈ అంశం హైకోర్టు వరకు వెళ్లడంతో పాటు, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA), డీవైఎఫ్ఐ ప్రతినిధులు తీవ్ర నిరసనలు తెలిపారు. చివరకు 'జానకి V వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా పేరు మార్చి, రెండు కోర్టు సన్నివేశాల్లో జానకి అనే పదాన్ని మ్యూట్ చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చారు.
చట్టపరమైన పోరాటానికి వెనుకాడం
2024లో టీవీ రంజిత్ తెరకెక్కించిన 'ఒరు భారత్ సర్కార్ ఉత్పన్నమ్' సినిమా శీర్షిక నుంచి 'భారత్' అనే పదాన్ని తొలిగిస్తేనే సెన్సార్ క్లియరెన్స్ లభించింది. ఇలాంటి పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే సినీ నిర్మాతలు ఈసారి సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలపై గళం విప్పుతున్నారు. చలనచిత్ర రంగాన్ని రక్షించుకోవడానికి చట్టపరమైన పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


