Bhooth Bangla 1st Day Collection: టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కలయికలో సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'హీరా ఫేరీ', 'భూల్ భూలయ్య' వంటి చిత్రాలు కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. సరిగ్గా అదే మేజిక్‌ను రిపీట్ చేస్తూ, తాజాగా ఏప్రిల్ 17న విడుదలైన 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.
తొలిరోజే రికార్డు స్థాయి వసూల్లు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'భూత్ బంగ్లా' సినిమా మొదటిరోజే దేశవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 3.32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం పెయిడ్ ప్రివ్యూల ద్వారా మరో రూ. 3.50 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా మొదటి రోజు భూత్ బంగ్లా సినిమా భారత్‌లో రూ. 15.75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అలాగే, గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ మొత్తం 18.90 కోట్ల రూపాయలకు చేరుకుంది.
ఈ వసూళ్లతో కార్తీక్ ఆర్యన్ నటించిన సూపర్ హిట్ మూవీ 'భూల్ భులయా 2' మొదటి రోజు ఇండియన్ నెట్ కలెక్షన్స్ (రూ. 14.50 కోట్లు) రికార్డును అక్షయ్ కుమార్ అధిగమించారు. అయితే, ఇటీవలి కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'స్త్రీ 2' (రూ. 55 కోట్లు) రికార్డుకు మాత్రం ఈ చిత్రం దూరంగానే ఉంది.
పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ప్రియదర్శన్ మార్క్
దర్శకుడు ప్రియదర్శన్ తనదైన శైలిలో వినోదాన్ని పండించడంలో దిట్ట. ఈ సినిమాలోనూ ఆయన మార్క్ కామెడీ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 'భూల్ భూలయ్య' చిత్రీకరించిన 'చోము ప్యాలెస్'లోనే ఈ సినిమాను కూడా షూట్ చేయడం ప్రేక్షకులకు పాత రోజులను గుర్తు చేస్తోంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) ఈ హారర్ కామెడీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
రాజ్‌పాల్ యాదవ్ కామెడీ టైమింగ్, టబు నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. వామికా గబ్బి, జిషూ సేన్ గుప్తా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అక్షయ్ కుమార్ ఎనర్జీ భూత్ బంగ్లా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
వివాదాలు దాటుకుని విజయతీరానికి
{{/usCountry}}రాజ్‌పాల్ యాదవ్ కామెడీ టైమింగ్, టబు నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. వామికా గబ్బి, జిషూ సేన్ గుప్తా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అక్షయ్ కుమార్ ఎనర్జీ భూత్ బంగ్లా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
వివాదాలు దాటుకుని విజయతీరానికి
{{/usCountry}}అయితే, భూత్ బంగ్లా సినిమాలో ఉపయోగించిన ఒక పాట లిరిక్స్ ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సినిమా నుంచి తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రియదర్శన్ స్పందిస్తూ.. "మేము ఎవరినీ కాపీ కొట్టలేదు, సత్యజిత్ రే అంటే మాకు ఎంతో గౌరవం. ఆ పాట సందర్భోచితంగా రాసింది మాత్రమే" అని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా, ఈ చిన్నపాటి వివాదాలు సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం.