Bhooth Bangla BO: ధురంధర్ 2 స్థాయిలో మరో బాలీవుడ్ మూవీకి ఓపెనింగ్స్- పెయిడ్ ప్రివ్యూలతోనే భూత్ బంగ్లాకి 3.50 కోట్లు!
Bhooth Bangla Box Office Collection Day 1 Estimated: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. రిలీజ్‌కు ఒకరోజు ముందు ఏప్రిల్ 16న పడిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఈ సినిమాకు మూడున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
Bhooth Bangla 1st Day Box Office Collection: సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన 'భూత్ బంగ్లా' థియేటర్లలో సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీ, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ధురంధర్ 2 స్థాయిలో ఓపెనింగ్స్
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది 'ధురంధర్ 2' సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా 'భూత్ బంగ్లా' నిలిచింది. అక్షయ్ కుమార్ మార్క్ కామెడీకి, డైరెక్టర్ ప్రియదర్శన్ టేకింగ్ తోడవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. హారర్ కామెడీ జానర్ సినిమాలకు సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉంటాయనే అంచనాలను తలకిందులు చేస్తూ, మొదటి రోజే 1.3 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా సుమారు రూ. 3.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కేవలం ప్రీ-సేల్స్ నుంచే రావడం విశేషం.
పెయిడ్ ప్రివ్యూలతో అదిరిపోయే ఆరంభం
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు 'పెయిడ్ ప్రివ్యూస్' నిర్వహించడం ఒక ట్రెండ్‌గా మారింది. 'ధురంధర్ 2' తరహాలోనే 'భూత్ బంగ్లా' చిత్రానికి కూడా గురువారం (ఏప్రిల్ 16) రాత్రి 9 గంటల నుంచే కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రివ్యూలు వేశారు. పరిమిత షోలు ఉన్నప్పటికీ, ఈ పెయిడ్ ప్రివ్యూల ద్వారానే సినిమాకు రూ. 3.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది ట్రేడ్ అనలిస్టుల అంచనాలను మించిపోవడం గమనార్హం. టాక్ పాజిటివ్‌గా ఉండటంతో శుక్రవారం మార్నింగ్ షోల నుంచే థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
రికార్డుల వేటలో 'భూత్ బంగ్లా'
మొదటి రోజు కలెక్షన్ల అంచనాలను పరిశీలిస్తే, భారత్‌లో భూత్ బంగ్లా చిత్రానికి రూ. 12 నుంచి రూ. 14 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. పెయిడ్ ప్రివ్యూల మొత్తాన్ని కలిపితే, ఓపెనింగ్ డే కలెక్షన్లు దాదాపు రూ. 15 నుంచి రూ. 17 కోట్ల మధ్య ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
హిందీలో వచ్చిన టాప్ హారర్ కామెడీ చిత్రాల జాబితాలో 'స్త్రీ 2', 'థామా', 'భూల్ భులయ్యా 3' తర్వాత నాలుగో స్థానంలో ఈ భూత్ బంగ్లా చిత్రం నిలవనుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. గతంలో హిట్టయిన 'భూల్ భులయ్యా 2' (రూ. 14.50 కోట్లు), 'స్త్రీ' (రూ. 8 కోట్లు), 'భేడియా' (రూ. 10 కోట్లు) రికార్డులను అక్షయ్ కుమార్ ఈ సినిమాతో చెరిపేసే అవకాశం ఉంది.
పాత కాంబినేషన్.. కొత్త అనుభూతి
ప్రియదర్శన్ దర్శకత్వంలో ఐదేళ్ల విరామం తర్వాత వచ్చిన హిందీ సినిమా ఇది. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ - ప్రియదర్శన్ కాంబో అనగానే 'హేరా ఫేరి', 'భూల్ భులయ్యా' వంటి క్లాసిక్స్ గుర్తొస్తాయి.
ఆ మ్యాజిక్ ఈ సినిమాలోనూ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయని భూత్ బంగ్లాపై రివ్యూలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత అక్షయ్ కుమార్‌కు ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ లభించినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


