...
...
Next Story

Bhooth Bangla: మా సినిమా ధురంధర్ ఏమీ కాదు.. మీ పిల్లలను తీసుకొని థియేటర్లకు రండి: డైరెక్టర్ కామెంట్స్

Bhooth Bangla:

Published on: Mar 24, 2026, 14:56:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా యాక్షన్, మసాలా సినిమాల ట్రెండ్ నడుస్తోంది కదా. కానీ తన లేటెస్ట్ సినిమాతో ఈ ట్రెండ్‌ను మార్చేస్తానని లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అతడు 'భూత్ బంగ్లా' అనే హారర్ కామెడీ సినిమాతో బాలీవుడ్‌లోకి మళ్లీ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు.

Bhooth Bangla: మా సినిమా ధురంధర్ ఏమీ కాదు.. మీ పిల్లలను తీసుకొని థియేటర్లకు రండి: డైరెక్టర్ కామెంట్స్
Bhooth Bangla: మా సినిమా ధురంధర్ ఏమీ కాదు.. మీ పిల్లలను తీసుకొని థియేటర్లకు రండి: డైరెక్టర్ కామెంట్స్

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో మొదలైపోయాయి. అయితే రీసెంట్‌గా వచ్చిన 'ధురంధర్ 2' లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ తర్వాత, వెంటనే ఒక హారర్ కామెడీని థియేటర్లలోకి తీసుకురావడం కరెక్టేనా అని చాలామందికి డౌట్ వస్తోంది. కానీ ప్రియదర్శన్ మాత్రం దీనిని అసలు ఒక పోటీగానే చూడట్లేదు.

యాక్షన్ సినిమాలతో పోటీపై ప్రియదర్శన్ కామెంట్స్..

పీటీఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రియదర్శన్ మాట్లాడుతూ.. తన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తాను అస్సలు భయపడట్లేదని చెప్పాడు. ఎందుకంటే యాక్షన్ సినిమాల కంటే ఇలాంటి హారర్ కామెడీ సినిమాలకు ఆడియన్స్ రీచ్ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇవి అన్ని వర్గాల ప్రేక్షకులకు అంటే ఒక యూనివర్సల్ ఆడియన్స్‌కు ఈజీగా కనెక్ట్ అవుతాయని అతడు వివరించాడు.

"మా సినిమాకు ఆడియన్స్ రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. పైగా జనాలు ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు కాకుండా కొత్తదనం కోరుకుంటారు. అదే మా భూత్ బంగ్లాకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇది పక్కా ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఇచ్చే సినిమా. బోర్డర్ లేదా ధురంధర్ సినిమాల్లాగా ఇందులో అంత సీరియస్‌నెస్ ఉండదు. ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారు. ఒక సినిమా ఆడియన్స్ అటెన్షన్‌ను, ఇంట్రెస్ట్‌ను హోల్డ్ చేయగలిగినంత కాలం అది కచ్చితంగా వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను" అని ప్రియదర్శన్ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

కలెక్ష్లన్ల ప్రభంజనం ఎలా ఉన్నా సరే, తన హారర్ కామెడీకి ఒక స్పెషాలిటీ ఉందని ప్రియదర్శన్ అన్నాడు. అదే ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవడం. "తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాంటి భయం లేకుండా చాలా గర్వంగా నా సినిమాకు తీసుకురావచ్చు. ఎందుకంటే నేను నా సినిమాల్లో ఎప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ, వల్గారిటీ గానీ అస్సలు వాడను. సినిమా చూస్తున్నప్పుడు పేరెంట్స్ ఇబ్బంది పడేలా నేను ఎప్పుడూ చేయను. నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇదే రూల్ ఫాలో అవుతున్నాను" అని ఈ స్టార్ డైరెక్టర్ స్పష్టం చేశాడు.

భూత్ బంగ్లా సినిమా డీటెయిల్స్..

బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్‌కు చెందిన బాలాజీ మోషన్ పిక్చర్స్, అలాగే కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ భూత్ బంగ్లా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పదేళ్లకు పైగా గ్యాప్ తర్వాత మళ్లీ అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe