...
...
Next Story

vishwambhara: విశ్వంభ‌ర రిలీజ్ డేట్‌పై బిగ్ బ‌జ్‌.. మెగాస్టార్ వ‌చ్చేది ఆ స్పెష‌ల్ రోజేనా?

vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు అదిరే న్యూస్. చిరు హీరోగా నటించిన ప్రతిష్ఠాత్మక విశ్వంభర రిలీజ్ కు ముహూర్తం ఖరారైందని సమాచారం. ఈ బిగ్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published on: May 13, 2026 12:34 PM IST
Advertisement

vishwambhara: చిరంజీవి ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్న మూవీ ‘విశ్వంభర’. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బిగ్ బజ్ తెగ వైరల్ గా మారుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే.

అందుకే లేటు

విశ్వంభర పోస్టర్ లో చిరంజీవి (x)
విశ్వంభర పోస్టర్ లో చిరంజీవి (x)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సోషియా ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ‘విశ్వంభర’. చెడుపై మంచి చేసే యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం మూవీ రిలీజ్ లేటు అవుతూ వస్తోంది.

విశ్వంభర రిలీజ్ డేట్

అయితే, తాజాగా ఓ బజ్ వైరల్ గా మారింది. ఆగస్టు 15, 2026న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశ్వంభర రిలీజ్ కానున్నట్లు తెలిసింది. స్పెషల్ డే అయిన ఇండిపెండెన్స్ డే నాడు మెగాస్టార్ తన కొత్త సినిమాతో థియేటర్లకు రాబోతున్నారని సమాచారం. రిలీజ్ డేట్ పై మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో క్లారిటీ ఇస్తారని టాక్.

2023లో

విశ్వంభర సినిమాను అనౌన్స్ చేసి రెండేళ్లు దాటిపోయాయి. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22, 2023న విశ్వంభర సినిమాను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 23న పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. 2024 ఆగస్టు వరకు షూటింగ్, డబ్బింగ్ పూర్తయ్యాయి.

వీఎఫ్ఎక్స్

చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోయిన్లు త్రిష, ఆషికా రంగనాథ్ నటించారు. రీసెంట్ గా త్రిష పుట్టిన రోజు (మే 4)న విశ్వంభర నుంచి అవనిగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఇంకా ఇషా చావ్లా, సురభి పురాణిక్, కునాల్ కపూర్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe