ప్రభాస్‌కు షాక్-అయిదో రోజు మరింతగా పడిపోయిన రాజా సాబ్ కలెక్షన్లు-4.85 కోట్లే-ఇలాగైతే హిట్ కష్టమే!
రెబల్ స్టార్ ప్రభాస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ది రాజాసాబ్ మూవీ కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి. అయిదో రోజు ఆ మూవీ రూ.4.85 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇలా అయితే మూవీ హిట్ కావడం కష్టమేనని అంటున్నారు.
వింటేజీ లుక్, చాలా కాలం తర్వాత కామెడీ, డ్యాన్స్ లతో ప్రభాస్.. ఇలా చాలా అంచనాలు, ఆశలతో థియేటర్లలోకి వచ్చింది ది రాజా సాబ్. మిక్స్ డ్ టాక్ అందుకున్నా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ సాధించింది. కానీ ఆ తర్వాత మూవీ ముందుకు సాగడం కష్టంగా మారింది. అయిదో రోజు అయితే అత్యంత దారుణంగా కేవలం రూ.4.85 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

రాజా సాబ్ కలెక్షన్లు
ప్రభాస్ నటించిన హారర్ కామెడీ సినిమా రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ప్రదర్శన చేస్తోంది. సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేసినా ఆడియన్స్ రాజా సాబ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయిదో రోజు (జనవరి 13) ఈ సినిమా ఇండియాలో రూ.4.85 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించిందని ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది. జనవరి 9న రిలీజైన రాజా సాబ్ మూవీకి ఓ రోజులో వచ్చిన అతి తక్కువ కలెక్షన్లు ఇవే.
ప్రభాస్ మూవీ వసూళ్లు
సక్నిల్క్ ప్రకారం రాజా సాబ్ దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద కష్టపడుతోంది. ప్రీమియర్లతో ఈ మూవీ రూ.9.15 కోట్లు సంపాదించింది. మొదటి రోజున ఇది రూ.53.75 కోట్లు [తెలుగు: రూ.47 కోట్లు; హిందీ: రూ.6 కోట్లు; తమిళం: రూ.55 లక్షలు; కన్నడ: రూ.1 లక్ష; మలయాళం: రూ.1 లక్ష] వసూలు చేసింది. రెండవ రోజున రాజా సాబ్ రూ.26 కోట్లు [తెలుగు: రూ.20.65 కోట్లు; హిందీ: రూ.5.1 కోట్లు; తమిళం: రూ.15 లక్షలు; కన్నడ: రూ.6 లక్షలు; మలయాళం: రూ.4 లక్షలు] ఖాతలో వేసుకుంది.
మూడో రోజు రాజా సాబ్ రూ.19.1 కోట్లు [తెలుగు: రూ.14.2 కోట్లు; హిందీ: రూ.4.65 కోట్లు; తమిళం: రూ.15 లక్షలు; కన్నడ: రూ.7 లక్షలు; మలయాళం: రూ.3 లక్షలు] సంపాదించింది. నాల్గవ రోజున రూ.6.6 కోట్లు [తెలుగు: రూ.4.98 కోట్లు; హిందీ: రూ.1.5 కోట్లు; తమిళం: రూ.7 లక్షలు; కన్నడ: రూ.3 లక్షలు; మలయాళం: రూ.2 లక్షలు] వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియాలో మొత్తం రూ.119.45 కోట్ల కలెక్షన్లు సాధించింది.
ఇక కష్టమే
రాజా సాబ్ బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు. బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి స్లో రన్ తో మూవీ హిట్ గా నిలవడం, పెట్టిన బడ్జెట్ రాబట్టడం కష్టమేనన్న కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ణప్తి థియేటర్లలోకి వచ్చేశాయి. ఇంకా ఈ రోజు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ గట్టెక్కడం అసాధ్యమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
రాజా సాబ్ గురించి
మారుతి దర్శకత్వం వహించిన రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ హీరో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన రాజా సాబ్ చిత్రంలో సంజయ్ దత్, బోమన్ ఇరాని, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్ తదితరులు నటించారు. రాజా సాబ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా శుక్రవారం (జనవరి 9) హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజైంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


