దారుణంగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్లు-కేవలం రూ.5.4 కోట్లు-ఆన్ లైన్ లో లీక్-పెట్టిన బడ్జెట్ వస్తుందా?

ప్రభాస్ హీరోగా వచ్చిన  హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీకి భారీ షాక్ తగిలింది. సోమవారం ఆ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. కేవలం రూ.5.4 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు ఆన్ లైన్ లో మూవీ లీక్ అవడం కలకలం రేపుతోంది.  

Jan 13, 2026, 11:03:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి 2026 కానుకగా థియేటర్లలోకి వచ్చిన ది రాజా సాబ్ కు షాక్ తగిలింది. సోమవారం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇండియాలో కేవలం రూ.5.4 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మూవీ రిలీజయ్యాక నాలుగో రోజు పరిస్థితి ఇలా ఉండటం ఫ్యాన్స్ కు మింగుడుపడనిదే. మరి మూవీ బడ్జెట్ ఎంత? రాజా సాబ్ హిట్ అవుతుందా?

రాజా సాబ్ లో ప్రభాస్
రాజా సాబ్ లో ప్రభాస్

రాజా సాబ్ కలెక్షన్లు

ఈ ఏడాది ప్రభాస్ నటించిన భారీ చిత్రం రాజా సాబ్. ఈ హారర్-కామెడీ థ్రిల్లర్ గత శుక్రవారం (జనవరి 9) విడుదలైంది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, పెద్ద ఓపెనింగ్ మాత్రం సాధించింది. అయితే, ఆ ఊపును కొనసాగించలేకపోయింది. దురదృష్టవశాత్తు గత కొన్ని రోజులుగా వసూళ్లలో క్షీణత కనిపిస్తోంది.

సోమవారం వసూళ్లు

రాజా సాబ్ కలెక్షన్లు నాలుగో రోజైన సోమవారం (జనవరి 12) దారుణంగా పడిపోయాయి. సక్నిల్క్ ప్రకారం రాజా సాబ్ నాలుగో రోజు ఇండియాలో రూ.5.4 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. ఇది సినిమా చరిత్రలో అతి తక్కువ సింగిల్-డే కలెక్షన్. మునుపటి రోజుల కంటే చాలా తక్కువ. మొదటి రోజు అత్యధికంగా రూ.53.75 కోట్లు సాధించిన రాజా సాబ్.. శనివారం రూ.26 కోట్లకు పడిపోయింది. ఆదివారం ఇది మరింత ఆందోళనకరంగా రూ.19.1 కోట్లుగా నమోదైంది.

మొత్తం ఎంతంటే?

సోమవారం వసూళ్లు కలుపుకొంటే రాజా సాబ్ మూవీకి నాలుగు రోజుల్లో ఇండియాలో మొత్తం రూ.113.4 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. చాలా మంది విమర్శకులు బలహీనమైన స్క్రీన్‌ప్లేను విమర్శించారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు నటించారు.

రాజా సాబ్ బడ్జెట్

రాజా సాబ్ బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు. మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. అయితే ఇప్పటికే రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అవి కాకుండా మిగతా సంక్రాంతి సినిమాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ హిట్ గా నిలుస్తుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

ఆన్ లైన్ లీక్

విడుదలైన ఒక రోజు తర్వాత రాజా సాబ్ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది మూవీ కలెక్షన్లను దెబ్బకొట్టేదే. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పైరేట్ ప్లాట్‌ఫారమ్‌లపై చర్యలు తీసుకున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More