Sunny Deol Suryaa: బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ సరికొత్త చిత్రం 'సూర్య: అంత్ సే ఆరంభ్ తక్' (Suryaa: Ant Se Aarambh Tak) విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్ అక్టోబర్ 19, 2026న సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. అయితే, ఇందులో వైద్య వృత్తిని, ఆరోగ్య రంగాన్ని నెగెటివ్ గా చూపించారనే విమర్శలు వస్తున్నాయి.
అసలు వివాదం ఏంటి?

'సూర్య' చిత్రం టీజర్‌లో సన్నీ డియోల్ ఒక వ్యక్తిగత విషాదం తర్వాత, వైద్య వ్యవస్థలోని లోపాలు, లంచగొండితనాన్ని ప్రశ్నించే పాత్రలో కనిపించారు. వైద్యులను దేవుడి రూపంగా భావిస్తారని, కానీ కొందరు రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజుతూ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనే డైలాగులతో టీజర్ సాగింది. డాక్టర్లు రాసేది ప్రిస్కిప్షన్ కాదు కమీషన్లు అనే సంచలన డైలాగ్ కూడా ఉంది.
డాక్టర్లు ఫైర్
సూర్య మూవీ టీజర్ పై డాక్టర్లు ఫైర్ అవుతున్నారు. సమాజంలో ఒకరిద్దరు చేసే తప్పులను చూపించి, మొత్తం వైద్య వృత్తికే అవినీతి అపవాదును అంటగట్టేలా ఈ టీజర్ ఉందని మండిపడుతున్నారు. అంతేకాకుండా, ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు. ఇతర సిబ్బందిపై జరిగే భౌతిక దాడులను హీరోయిజంగా, ఎంకరేజ్ చేసేలా చూపించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగంలోకి మెడికల్ అసోసియేషన్
ఈ వివాదంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi) రెసిడెంట్ డాక్టర్ల సంఘం తీవ్రంగా స్పందించాయి. వైద్యులు నిరంతరం రోగులను రక్షించేందుకు శ్రమిస్తారని, వారిని కించపరిచేలా చూపించడం సరికాదని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఐఎంఏ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అత్యవసర లేఖ రాసింది.
బ్యాన్ చేయాలని
వైద్య రంగంలో అవినీతిని ప్రశ్నించడాన్ని తాము తప్పుపట్టడం లేదని డాక్టర్లు అన్నారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్పా ఇలా సినిమాల్లో వైద్యులపై హింసను ప్రేరేపించడం వల్ల సమాజంలో డాక్టర్-రోగి మధ్య ఉండే నమ్మకమైన బంధం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు.
{{/usCountry}}వైద్య రంగంలో అవినీతిని ప్రశ్నించడాన్ని తాము తప్పుపట్టడం లేదని డాక్టర్లు అన్నారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్పా ఇలా సినిమాల్లో వైద్యులపై హింసను ప్రేరేపించడం వల్ల సమాజంలో డాక్టర్-రోగి మధ్య ఉండే నమ్మకమైన బంధం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు.
{{/usCountry}}వైద్యులపై దాడులను నార్మలైజ్ చేసేలా ఉన్న ఈ సూర్య సినిమా ప్రమోషనల్ కంటెంట్‌ను తక్షణమే రివ్యూ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. చిత్ర యూనిట్ దీనిపై వివరణ ఇస్తూ మార్పులు చేయాలన్నారు. లేనిపక్షంలో సినిమాపై నిషేధం విధించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.
రిలీజ్ ఎప్పుడు?
ఈ వివాదంపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC).. సూర్య చిత్రం ఇంకా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. ఎమ్. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ వివాదం నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.