Jana Nayagan Leak: షాకింగ్.. రిలీజ్ కాకముందే ఆన్‌లైన్‌లో విజయ్ 'జన నాయగన్' ఫుల్ మూవీ లీక్.. ఇంకెంత టార్గెట్ చేస్తారంటూ!
Jana Nayagan Leak: తమిళనాడు ఎన్నికలకు ముందు స్టార్ హీరో దళపతి విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. అతని చివరి సినిమా ‘జన నాయగన్’ థియేటర్లలో రిలీజ్ కాకముందే ఆన్ లైన్ లో హెచ్ డీ ప్రింట్ లీక్ అయింది.
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒకటే చర్చ.. దళపతి విజయ్ ఆఖరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) థియేటర్లో విడుదలకు ముందే లీక్ అవ్వడం ఇప్పుడు కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. రాజకీయ అరంగేట్రం చేయబోతున్న విజయ్‌కి ఇది చివరి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, థియేటర్లలో సినిమా సందడి చేయకముందే.. హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫుల్ మూవీ పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది.

జన నాయగన్ లీక్
గత మూడు నెలలుగా సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి క్లియరెన్స్ రాక జన నాయగన్ మూవీ రిలీజ్ పెండింగ్‌లో ఉంది. గురువారం (ఏప్రిల్ 9) రాత్రి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని చిన్న క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ కాగా, శుక్రవారం (ఏప్రిల్ 10) ఉదయానికల్లా పూర్తి సినిమా పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన నాయగన్ మూవీ లీక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ఈ లీక్ వ్యవహారం చిత్ర బృందాన్ని తీవ్రంగా కలచివేస్తోంది.
రియాక్షన్
ఈ అనూహ్య పరిణామంపై సినీ ప్రముఖులు, ట్రేడ్ విశ్లేషకులు మండిపడుతున్నారు. "దాదాపు రూ.400 నుంచి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఇలా రాత్రికి రాత్రే లీక్ కావడం నిర్మాతలకు, పంపిణీదారులకు అత్యంత క్లిష్ట సమయం. సినిమా ఇప్పటికే పలు ఇబ్బందుల్లో ఉన్నందున చిత్ర యూనిట్ మరింత జాగ్రత్తగా ఉండాల్సింది.
సెన్సార్ సర్టిఫికేట్ రాగానే వీలైనంత త్వరగా జన నాయగన్ సినిమాను థియేటర్లలో విడుదల చేయడమే దీనికి సరైన పరిష్కారం" అని ప్రముఖ సినీ ఇన్‌ఫ్లుయెన్సర్ అముత భారతి ఎక్స్ లో పోస్టు చేశాడు.
అదొక్కటే మార్గం
సింగపూర్ మూవీస్ అనే ప్రముఖ ట్రేడ్ సంస్థ కూడా ఈ లీక్‌పై స్పందిస్తూ.. "ఇది నిజంగా షాకింగ్ న్యూస్. సినిమా మొత్తం ప్రీమియం హెచ్‌డీ క్వాలిటీలో బయటకు వచ్చింది. కాపీరైట్ చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. తక్షణమే సినిమాను విడుదల చేయడం ఒక్కటే మార్గం’’ అని పేర్కొంది.
విజయ్‌ను టార్గెట్?
ప్రముఖ నిర్మాత జి. ధనంజయన్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంటనే కోర్టును ఆశ్రయించి, లక్షలాది మంది చూడకముందే ఈ లింకులను తొలగించాలని కోరారు.
"సినిమా వ్యాపారం ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. విజయ్ ఆఖరి సినిమాను ఇంకా ఎంతగా టార్గెట్ చేస్తారు?" అని ధనంజయన్ ప్రశ్నించారు. ఇది కేవలం పైరసీ మాత్రమే కాదని, విజయ్ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకునే కుట్రలో భాగమని అభిమానులు ఆరోపిస్తున్నారు.
జన నాయగన్ గురించి..
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ జన నాయగన్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ చిక్కుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
విజయ్ రాజకీయ ఎంట్రీ కారణంగానే సెన్సార్ బోర్డ్ కావాలనే జాప్యం చేస్తోందని చిత్ర యూనిట్ ఇప్పటికే ఆరోపించింది. ఈ పరిస్థితుల మధ్య సినిమా లీక్ అవ్వడం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


