టాక్సిక్ మూవీ నుంచి రాయగా హీరో యష్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటీవల రిలీజైన టీజర్ కలకలం రేపుతోంది. ఇందులో ఇంటిమేట్ సీన్ మరీ బోల్డ్ గా ఉండటమే ఇందుకు కారణం. ఈ టీజర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా టీజర్ పై చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు కర్ణాటక మహిళా కమిషన్ లెటర్ రాసింది. దీంతో యష్ టాక్సిక్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది.
టాక్సిక్ టీజర్

యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమా టీజర్ వివాదాస్పదంగా మారింది. ఈ టీజర్‌లో కారులో ఒక మహిళతో యష్ శృంగారం చేస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కొంతమందిని కాల్చి చంపుతాడు. ఈ సన్నివేశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ టీజర్ వివాదాల్లో చిక్కుకుంది. సోమవారం (జనవరి 12) నాడు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ (KSWC)కు ఫిర్యాదు చేసింది.
టీజర్ లో అశ్లీలం
పీటీఐ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్ అధికారులను కలిసి ఈ విషయమై ఫిర్యాదు సమర్పించారు. అశ్లీల సీన్లు ఉన్న టాక్సిక్ టీజర్‌ను తొలగించాలని వారు కోరుతున్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి "తగిన చర్యలు" తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది.
మహిళలను కించపరిచేలా
"ఈ సినిమా టీజర్‌లోని అభ్యంతరకరమైన, స్పష్టమైన కంటెంట్ మహిళలు, పిల్లల సామాజిక శ్రేయస్సుకి తీవ్ర హాని కలిగిస్తోంది. వయస్సు సంబంధిత హెచ్చరిక లేకుండా బహిరంగంగా విడుదలైన ఈ సన్నివేశాలు మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నాయి. కన్నడ సంస్కృతిని అవమానిస్తున్నాయి" అని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ లేఖలో పేర్కొన్నారు.
"సమాజంపై ముఖ్యంగా మైనర్లపై ప్రతికూల ప్రభావం" చూపుతుందని పేర్కొంటూ, ఈ టీజర్‌ను నిషేధించాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని పార్టీ కోరింది.
యాక్షన్ తీసుకోవాలని
{{/usCountry}}"సమాజంపై ముఖ్యంగా మైనర్లపై ప్రతికూల ప్రభావం" చూపుతుందని పేర్కొంటూ, ఈ టీజర్‌ను నిషేధించాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని పార్టీ కోరింది.
యాక్షన్ తీసుకోవాలని
{{/usCountry}}"ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం తరపున ఈ విషయాన్ని మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించి, రాష్ట్ర సాంస్కృతికచ నైతిక విలువలను "పరిరక్షించడానికి" తక్షణ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము" అని లేఖలో జోడించారు. "మీరు సమర్పించిన పిటిషన్‌లోని అంశంపై నియమాల ప్రకారం పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని కోరాం" అని కమిషన్ కార్యదర్మి ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ సమర్పించిన పిటిషన్‌ను ఉటంకిస్తూ సెన్సార్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపారు.
'టాక్సిక్' గురించి
'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' టీజర్‌ను జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్-ప్యాక్డ్ టీజర్ కారులో ఒక మహిళతో యష్ సెక్స్ చేయడంతో టీజర్ ప్రారంభమై, ఆ తర్వాత కొంతమందిని కాల్చి చంపడంతో కొనసాగుతుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' లో రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.