Bigg Boss 10: బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టమా? ఒక్కసారైనా షోలో పార్టిసిపేట్ చేయాలనుందా? అందుకు తగ్గ టాలెంట్ మీలో ఉందా? ఆడిషన్ వీడియో పంపడం మిస్సయ్యారా? అయినా ఫీల్ అవాల్సిన అవసరం లేదు. మీలాంటి తెలుగు ఆడియన్స్ కోసం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మేకర్స్ మరో గోల్డెన్ ఆఫర్ తీసుకొచ్చారు.
బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి అగ్ని పరీక్ష పేరుతో కామనర్ల నుంచి కొంతమందిని షోకు సెలక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో మరోసారి అగ్ని పరీక్ష కోసం ఆడిషన్లు స్వీకరించారు. ఈ ఆడిషన్లు పంపాల్సిన టైమ్ ముగిసింది. వివిధ కారణాల వల్ల కొంతమంది ఆడిషన్లు పంపలేక ఫీల్ అవుతున్న వాళ్లూ ఉన్నారు.
మరో గోల్డెన్ ఛాన్స్
బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం ఆడిషన్లు పంపే మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. యాంకర్ శ్రీముఖితో కూడిన ఓ వీడియోను స్టార్ మా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడిషన్స్ పంపేందుకు మరో ఛాన్స్ వచ్చిందని శ్రీముఖి పేర్కొంది.
ఏం చేయాలంటే?
బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడిషన్లు పంపాలనుకునే వాళ్లు ముందుగా గూగుల్ ఓపెన్ చేసి whitegold.money/aptelugu అని సెర్చ్ చేయాలి. అప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిపై బిగ్ బాస్ అగ్ని పరీక్ష లోగోతో పాటు శ్రీముఖి ఫొటో కూడా ఉంటుంది.
అప్లై చేసే విధానం
{{/usCountry}}బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడిషన్లు పంపాలనుకునే వాళ్లు ముందుగా గూగుల్ ఓపెన్ చేసి whitegold.money/aptelugu అని సెర్చ్ చేయాలి. అప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిపై బిగ్ బాస్ అగ్ని పరీక్ష లోగోతో పాటు శ్రీముఖి ఫొటో కూడా ఉంటుంది.
అప్లై చేసే విధానం
{{/usCountry}}బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం అప్లై చేయడానికి మూడు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ టాలెంట్ గురించి చెప్పేలా తెలుగులో ఓ ఆడిషన్ వీడియోను రికార్డు చేయాలి. ఆ వీడియోను మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయాలి. @whitegold.telugu పేజీని ట్యాగ్ చేయడంతో పాటు ఫాలో కొట్టాలి.
చివరగా whitegold.money/aptelugu ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇందులో పేరు, డేటాఫ్ బర్త్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, జెండర్, అడ్రస్, ఏజ్, ఆడిషన్ వీడియో సోషల్ మీడియా లిక్ వివరాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ వీడియోను పరిశీలించిన తర్వాత మేకర్స్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇంకెందుకు లేటు మీ లక్ ను పరీక్షించుకోండి మరి.