Bigg Boss 10: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ పై ఇప్పటి నుంచే క్రేజీ బజ్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 10 సీజన్ అక్టోబర్ లో స్టార్ట్ కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాకుండా ఈ సారి ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు టాప్ సెలబ్రిటీలను బిగ్ బాస్ టీమ్ కాంటాక్ట్ చేస్తుందనే విషయం వైరల్ గా మారింది.
బిగ్ బాస్ 10

బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉండే క్రేజే వేరు. 9 సీజన్లు కూడా తెలుగు ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు పదో సీజన్ ను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీర్చదిద్దేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో గట్టిగానే ఫోకస్ చేశారని సమాచారం.
ఆ ఇద్దరు హీరోయిన్లు
బిగ్ బాస్ 10 సీజన్ పాపులారిటీని అమాంతం పెంచేందుకు ఇద్దరు సీరియల్ హీరోయిన్లను ఎలాగైనా షోకు రప్పించాాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ హీరోయిన్లు ఎవరో కాదు.. ఒకరేమో తేజస్విని గౌడ, మరొకరు కావ్య శ్రీ. తేజస్వి గౌడ భర్త అమర్ దీప్ ఇప్పటికే బిగ్ బాస్ కు ఒకసారి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
భారీ డిమాండ్
సీరియల్ హీరోయిన్లు తేజస్విని గౌడ, కావ్య శ్రీకి ఫ్యాన్స్ ఎక్కువే. సీరియల్స్ చూసే మహిళలు, యూత్.. ఇలా ఈ సీరియల్ భామలకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇప్పుడీ ఫాలోయింగ్ ను బిగ్ బాస్ సీజన్ 10కు అనుకూలంగా మార్చుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ ఇద్దరు హీరోయిన్లను వచ్చే సీజన్ కోసం బిగ్ బాస్ టీమ్ సంప్రదించిందని టాక్. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం కోసం ఈ భామలు భారీగా డిమాండ్ చేశారని అంటున్నారు.
ఒక్కో వారానికి
తేజస్విని గౌడ, కావ్య శ్రీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని తెలిసింది. ముఖ్యంగా అమర్ దీప్ వైఫ్ తేజస్విని అయితే వారానికి రూ.6 లక్షలు ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. ప్రస్తుతం తమిళ సీరియల్స్ తో తేజస్విని బిజీగా ఉంది. అలాగే తెలుగులో ‘కూకు విత్ జాతిరత్నాలు’ అనే కుకింగ్ షో చేస్తోంది. ఆ సీరియల్స్ వదులుకుని బిగ్ బాస్ రియాలిటీ షోకు వెళ్లాలి కాబట్టి ఆమె భారీగానే డిమాండ్ చేసిందని టాక్.
కావ్య శ్రీ కూడా
{{/usCountry}}తేజస్విని గౌడ, కావ్య శ్రీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని తెలిసింది. ముఖ్యంగా అమర్ దీప్ వైఫ్ తేజస్విని అయితే వారానికి రూ.6 లక్షలు ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. ప్రస్తుతం తమిళ సీరియల్స్ తో తేజస్విని బిజీగా ఉంది. అలాగే తెలుగులో ‘కూకు విత్ జాతిరత్నాలు’ అనే కుకింగ్ షో చేస్తోంది. ఆ సీరియల్స్ వదులుకుని బిగ్ బాస్ రియాలిటీ షోకు వెళ్లాలి కాబట్టి ఆమె భారీగానే డిమాండ్ చేసిందని టాక్.
కావ్య శ్రీ కూడా
{{/usCountry}}కావ్య శ్రీ ఏమో వారానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే కావ్య శ్రీతో పాటు తేజస్వినిని కూడా బిగ్ బాస్ 10 సీజన్ కు రప్పించాలనే లక్ష్యంతో ఉన్న బిగ్ బాస్ టీమ్ వీళ్లు అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పారని సమాచారం. వీళ్లు ఇద్దరు ఈ సారి బిగ్ బాస్ కు వస్తే 10 సీజన్ కు టాప్ రేటింగ్స్ ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి. షో టాప్ లో ఉంటుందని అంటున్నారు.