Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రాబోతోంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్ తో పది రెట్ల వినోదాన్ని పంచేందుకు ఈ రియాలిటీ షో సిద్ధమవుతోంది. ఈ బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో రాగానే ఈ సారి కంటెస్టెంట్లుగా హౌజ్ లోకి వెళ్లే సెలబ్రిటీలు ఎవరనే చర్చ జోరందుకుంది. వీళ్లలో ఓ సీనియర్ హీరోయిన్, సీరియల్ భామ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
సీనియర్ హీరోయిన్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెడుతుందని టాక్. తరచూ వివాదాల్లో ఉండే ఆమె ఈ సారి స్పెషల్ గా సాగే బిగ్ బాస్ సీజన్ కు పర్ఫెక్ట్ ఛాయిస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై షో మేకర్స్ ఆమెను సంప్రదించారని టాక్.
వారానికి లక్ష
కస్తూరి శంకర్ ను ఎలాగైనా హౌజ్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియా టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళంలో ఒకప్పుడు స్టార్ గా వెలుగు వెలిగిన ఈ సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సినిమాలు, సిరీస్ లు, సీరియల్స్ లో నటిస్తోంది.
కస్తూరి కోసం వారానికి రూ.లక్ష రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలిసింది. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సినిమా ‘అన్నమయ్య’లో కస్తూరి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసింది.
సీరియల్ భామ
మరోవైపు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రియాంక నల్కర్ ను కూడా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు తీసుకొస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమాల నుంచి సీరియల్స్ కు మారిన ఈ బ్యూటీకి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగే ఉంది.
{{/usCountry}}మరోవైపు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రియాంక నల్కర్ ను కూడా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు తీసుకొస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమాల నుంచి సీరియల్స్ కు మారిన ఈ బ్యూటీకి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగే ఉంది.
{{/usCountry}}ఆ మూవీతో ఎంట్రీ
ప్రియాంక ఫస్ట్ సినిమాల్లో నటించింది. శర్వానంద్ హీరోగా నటించిన ‘అందరి బంధువయా’ అనే సినిమాలో క్యారెక్టర్ తో ప్రియాంక డెబ్యూ చేసింది. ఆ తర్వాత నా సామి రంగా, వెల్ కమ్ టు అమెరికా, కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి, వైఫ్ ఆఫ్ రామ్, కాంచన 3 మూవీస్ లో మెరిసింది.
టాప్ ప్లేస్ లో
తెలుగులో చాలా కాలం నుంచి ప్రియాంక టాప్ సీరియల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ భామ ఆహ్వానం, మేఘమాల, మంగమ్మ గారి మనవరాలు, శ్రావణ సమీరాలు, లక్ష్మీ రావే మా ఇంటికి తదితర సీరియల్స్ చేసింది.
రీసెంట్ జబర్దస్త్ వర్ష హోస్ట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. గతంలో తమిళ బిగ్ బాస్ కోసం తనను అడిగితే కుదరలేదని చెప్పింది. తెలుగు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా వెళ్లలేకపోయానంది. ఈ సారి మాత్రం అడిగితే కచ్చితంగా బిగ్ బాస్ 10కు వెళ్తానని చెప్పింది. దీన్ని బట్టి ఈ సారి ఫస్ట్ కంటెస్టెంట్ మీరేనా అని వర్ష అడిగితే.. ప్రియాంక నవ్వేసింది. దీన్ని బట్టి ప్రియాంక ఈ సారి బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.