...
...
Next Story

Bigg Boss 10: ఈ ట్విస్ట్ అదుర్స్.. బిగ్ బాస్ 10లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ కన్ఫామ్?

Bigg Boss 10: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కొత్త సీజన్ రాబోతుంది. మరి కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ 10 తెలుగుకు తెరలేవనుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష పోరు జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ టాలీవుడ్ విలన్ ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెడతాడనే టాక్ తెగ వైరల్ గా మారింది.

Published on: Aug 22, 2026, 17:17:57 IST
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్ల లిస్ట్ లో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ఇప్పటికే బుల్లితెర స్టార్లు, అందాల భామలు, హాట్ యాంకర్లు హౌజ్ లోకి వెళ్తున్నారనే బజ్ తెగ వైరల్ గా మారింది. ఇక తాజాగా టాలీవుడ్ యంగ్ విలన్ ‘టెంపర్ వంశీ’ కూడా ఈ సారి బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లు

ఈ ట్విస్ట్ అదుర్స్.. బిగ్ బాస్ 10లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ కన్ఫామ్? (x/Tempervamsi8)
ఈ ట్విస్ట్ అదుర్స్.. బిగ్ బాస్ 10లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ కన్ఫామ్? (x/Tempervamsi8)

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. ఇప్పటికే కామనర్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

విలన్ వంశీ

తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి టాలీవుడ్ యంగ్ విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం వైరల్ గా మారింది. తెలుగులో విలన్ క్యారెక్టర్లతో వంశీ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ సినిమాతో వంశీకి మంచి పేరొచ్చింది. అందులో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా విలనిజం పండించాడు వంశీ.

వరుస సినిమాలతో

టెంపర్ వంశీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భరత్ అనే నేను, అత్తారింటికి దారేదీ, భీష్మ, సాహో, హిట్ 2, దేవర తదితర చిత్రాల్లో విలన్ క్యారెక్టర్లు చేశాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కొరియన్ కనకరాజు సినిమాలోనూ వంశీ అదరగొట్టాడు.

ఎంతవరకు నిజం?

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కామనర్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసే అగ్ని పరీక్ష కొనసాగుతోంది. స్టార్ మా, జియోహాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలోని టాస్క్ లపై విమర్శలు వస్తున్నాయి. కంటెస్టెంట్లను కనీసం మనుషుల్లాగా డీల్ చేయడం లేదని కొంతమంది అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks