...
...
Next Story

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగు.. ఇదేం ట్విస్ట్ మామ.. ఫ‌స్ట్ వీక్‌లోనే డబుల్ ఎలిమినేష‌న్‌? వీళ్లు అవుట్!

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగులోనే ఫస్ట్ వీక్ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్టింగ్ నుంచే గొడవలతో హౌస్ హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్ లోనే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ తెగ వైరల్ గా మారింది.

Published on: Sep 10, 2026, 12:41:52 IST
Advertisement

Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ జోరందుకుంది. ఫస్ట్ వీక్ లోనే హౌస్ లో గొడవలు బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లో సిచ్యువేషన్ ఏమో రోహిత్ వర్సెస్ త్రిగుణ్ అనేలా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్ బిగ్ బాస్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడనే టాక్ వినిపిస్తోంది.

డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ 10 తెలుగు.. ఇదేం ట్విస్ట్ మామ.. ఫ‌స్ట్ వీక్‌లోనే డబుల్ ఎలిమినేష‌న్‌? వీళ్లు అవుట్! (youtube/starmaa)
బిగ్ బాస్ 10 తెలుగు.. ఇదేం ట్విస్ట్ మామ.. ఫ‌స్ట్ వీక్‌లోనే డబుల్ ఎలిమినేష‌న్‌? వీళ్లు అవుట్! (youtube/starmaa)

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఫస్ట్ వీక్ లోనే డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే హౌస్ మొత్తంలో గొడవలన్నీ త్రిగుణ్ వర్సెస్ రోహిత్ అన్నట్లే సాగుతున్నాయి. ఇది మిగతా కంటెస్టెంట్ల ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడుతోందనే టాక్ ఉంది.

మిడ్ వీక్ ఎలిమినేషన్

ఈ బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ వీక్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్ఫామ్ అని సమాచారం. మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆటో రాంప్రసాద్, చరణ్, చైత్ర రాయ్ ఉన్నారు. వీళ్ల ముగ్గురికి ఓ ప్రక్రియ పెట్టారని తెలిసింది. ఇందులో నుంచి చరణ్ ను ఎలిమినేట్ చేశారని టాక్. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన చరణ్ హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా కూడా కనిపించలేదు.

బిగ్ బాస్ ఓటింగ్

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో ఓటింగ్ ట్రెండ్ చూస్తే షాకింగ్ గా ఉంది. లీస్ట్ ఓటింగ్ లో లాస్ట్ 5లో వరుసగా సింగర్ ఝాన్సీ, సుధీర్ రెడ్డి, చైత్ర రాయ్, టెంపర్ వంశీ, కృష్ణుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అనేది కన్ఫామ్ అయితే ఓటింగ్ పరంగా లాస్ట్ లో ఉన్న కృష్ణుడిని వీకెండ్ లో ఇంటికి పంపించే ఛాన్స్ ఉంది.

టాప్ 5 ఇలా

హీరో త్రిగుణ్ పక్కా ప్లాన్ తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తున్నాడు. ఎప్పుడూ ఏదో మాట్లాడుతూ, ప్లాన్ చేస్తూ అటెన్షన్ మొత్తం తనమీద ఉండేలా చూసుకుంటున్నాడు. కానీ ఈ క్రమంలోనే త్రిగుణ్ డామినెన్స్ కూడా ఎక్కువ అవుతుందనే విమర్శలూ వస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks