బిగ్ బాస్ సీజన్ 19లో తనదైన ముద్ర వేసి 3వ రన్నరప్‌గా నిలిచిన బ్యూటి తాన్య మిట్టల్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు తాన్య మిట్టల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారు

ముఖ్యంగా ‘నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారు’, ‘బక్లావా తినడానికే దుబాయ్ వెళ్తాను’ వంటి తాన్యా మిట్టల్ మాటలు నెటిజన్లకు ఆశ్చర్యం కలిగించాయి. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ ప్రయాణం ముగిశాక, తనపై వస్తున్న ఆ వార్తలపై తాన్య గ్వాలియర్‌లో స్పందించారు.
150 మంది బాడీగార్డ్స్ కాదు.. స్టాఫ్!
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యాక్టరీని చూపిస్తూ తాన్య మిట్టల్ అసలు విషయం వెల్లడించారు. "నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారని నేను ఎక్కడా చెప్పలేదు. ఇంటర్నెట్‌లో వెతికినా అలాంటి వీడియో మీకు ఎక్కడా దొరకదు. అదంతా సృష్టించిన ప్రచారం మాత్రమే" అని తాన్య మిట్టల్ అసలు కథ బయటపెట్టారు.
వ్యక్తిగత భద్రత ఉంది
అసలేం జరిగిందో వివరిస్తూ.. "నా దగ్గర 150 మందికి పైగా సిబ్బంది (Staff) పనిచేస్తున్నారని జైషాన్ ఖాద్రీతో సరదాగా చెప్పాను. ఆయన దానిని జోక్ చేస్తూ బాడీగార్డ్స్ అని మార్చేశారు. నాకు వ్యక్తిగత భద్రత ఉంది. అది గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతోంది. కానీ, సంఖ్య మాత్రం ఆ స్థాయిలో లేదు" అని తాన్య మిట్టల్ వివరించారు.
వ్యాపార సామ్రాజ్యంపై స్పష్టత
తన ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విమర్శలకు కూడా తాన్యా మిట్టల్ గట్టిగానే బదులిచ్చారు. "నాకు టెక్ట్స్‌టైల్స్, ఫార్మా, గిఫ్ట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించాలని లేదు. కానీ, నన్ను సపోర్ట్ చేసిన వారు నేను అబద్ధాల కోరు కాదని, నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నానని నిరూపించుకోవడానికే ఈ ఫ్యాక్టరీ టూర్ చేస్తున్నాను" అని తాన్య పేర్కొన్నారు.
ఏక్తా కపూర్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్
{{/usCountry}}తన ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విమర్శలకు కూడా తాన్యా మిట్టల్ గట్టిగానే బదులిచ్చారు. "నాకు టెక్ట్స్‌టైల్స్, ఫార్మా, గిఫ్ట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించాలని లేదు. కానీ, నన్ను సపోర్ట్ చేసిన వారు నేను అబద్ధాల కోరు కాదని, నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నానని నిరూపించుకోవడానికే ఈ ఫ్యాక్టరీ టూర్ చేస్తున్నాను" అని తాన్య పేర్కొన్నారు.
ఏక్తా కపూర్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్
{{/usCountry}}స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన తాన్యా మిట్టల్‌కు బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ లభించింది. ఫైనలిస్ట్‌గా నిలవడమే కాకుండా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాన్ని కూడా తాన్య మిట్టల్ దక్కించుకున్నారు. త్వరలోనే తాన్య నటిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు.