...
...
Next Story

Bigg Boss: బుల్లితెరపై బిగ్ బాస్ బ్యూటీ- సీరియల్‌తో తాన్య మిట్టల్ ఎంట్రీ- మాట నిలబెట్టుకున్న నిర్మాత- భారీ అంచనాలు!

Bigg Boss Tanya Mittal TV Serial Debut: బిగ్ బాస్ సీజన్ 19లో తనదైన ముద్ర వేసిన బ్యూటిఫుల్ తాన్యా మిట్టల్ ఇప్పుడు బుల్లితెరపై నటిగా అరంగేట్రం చేస్తున్నారు. టెలివిజన్ క్వీన్ ఏక్తా కపూర్ నిర్మాణంలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ఆమె తన నటనా ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు.

Published on: May 7, 2026, 06:28:55 IST
Advertisement

Bigg Boss Tanya Mittal Entry To Television: బిగ్ బాస్ హౌస్‌లో తన బోల్డ్ పర్సనాలిటీతో పాపులర్ అయిన తాన్య మిట్టల్ ఇప్పుడు ఫిక్షన్ డ్రామాలోకి అడుగుపెట్టారు. ఏక్తా కపూర్‌కు చెందిన 'బాలాజీ టెలిఫిల్మ్స్' నిర్మిస్తున్న కొత్త సీరియల్ షూటింగ్‌లో తాన్య జాయిన్ అయ్యారు. అంటే, బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనుంది బిగ్ బాస్ బ్యూటీ తాన్య మిట్టల్.

షూటింగ్ సెట్స్‌లోని

బుల్లితెరపై బిగ్ బాస్ బ్యూటీ- సీరియల్‌తో తాన్య మిట్టల్ ఎంట్రీ- మాట నిలబెట్టుకున్న నిర్మాత- భారీ అంచనాలు!
బుల్లితెరపై బిగ్ బాస్ బ్యూటీ- సీరియల్‌తో తాన్య మిట్టల్ ఎంట్రీ- మాట నిలబెట్టుకున్న నిర్మాత- భారీ అంచనాలు!

ఈ విషయాన్ని తాన్య మిట్టల్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సెట్స్‌లోని తన వానిటీ వ్యాన్ నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు తాన్యా మిట్టల్.

"బాలాజీ సంస్థతో నా మొదటి షో షూటింగ్ మొదలైంది. ఇది చాలా భిన్నమైన అనుభూతి. స్టార్‌డమ్ వచ్చింది, ఇప్పుడు నా మొదటి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కింది. నా హార్డ్ వర్క్ కంటే కూడా నా అభిమానుల కల ఇది. అందుకే అందరికీ కంగ్రాట్యులేషన్స్" అని తాన్యా మిట్టల్ తన వీడియోలో పేర్కొన్నారు.

ఏక్తా కపూర్ ఇచ్చిన మాట.. నెరవేరిన కల

తాన్యాకు ఈ అవకాశం రావడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ 19 సీజన్ నడుస్తున్న సమయంలో.. 'నాగిన్ 7' ప్రమోషన్ కోసం నిర్మాత ఏక్తా కపూర్ హౌస్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో తాన్యా మిట్టల్, అమాల్ మాలిక్ నటనపై ఏక్తా ప్రశంసలు కురిపించడమే కాకుండా, తన తదుపరి ప్రాజెక్టుల్లో వారికి అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశారు.

ఇకపోతే బిగ్ బాస్ 19వ సీజన్‌లో తాన్యా ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. హౌస్‌లో జరిగిన గొడవలు, హై-వోల్టేజ్ డ్రామాలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించేది. బలమైన వ్యక్తిత్వం కలిగిన కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ హిందీ 19 సీజన్‌లో టాప్ 4 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి టైటిల్ రేసులో గట్టి పోటీ ఇచ్చారు తాన్య మిట్టల్. చివరకు గౌరవ్ ఖన్నా విన్నర్‌గా నిలిచినప్పటికీ, తాన్యా మాత్రం ఏక్తా కపూర్ కళ్లలో పడి తన కెరీర్‌ను మలుపు తిప్పుకున్నారు.

సీరియల్‌పై భారీ అంచనాలు

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పేరు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సీరియల్ వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, అభిమానులు గర్వపడేలా చేస్తానని తాన్యా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. తాన్యా మిట్టల్ నటిగా ఏ షోతో ఎంట్రీ ఇస్తున్నారు?

తాన్యా మిట్టల్ ఏక్తా కపూర్‌కు చెందిన 'బాలాజీ టెలిఫిల్మ్స్' నిర్మాణంలో రూపొందుతున్న ఇంకా పేరు నిర్ణయించని కొత్త షోతో నటిగా పరిచయమవుతున్నారు.

2. తాన్యాకు ఏక్తా కపూర్ ఎప్పుడు అవకాశం ఇచ్చారు?

బిగ్ బాస్ 19వ సీజన్ నడుస్తున్నప్పుడు ఏక్తా కపూర్ గెస్ట్‌గా హౌస్‌లోకి వెళ్లిన సమయంలో, తాన్యా మిట్టల్ ప్రతిభను చూసి తన షోలో అవకాశం ఇస్తానని ప్రకటించారు.

3. బిగ్ బాస్ 19వ సీజన్ విజేత ఎవరు?

బిగ్ బాస్ 19వ సీజన్ టైటిల్‌ను గౌరవ్ ఖన్నా గెలుచుకోగా, తాన్యా మిట్టల్ టాప్ 4 కంటెస్టెంట్‌గా నిలిచారు.

4. తాన్యా కొత్త షో ఏ ఛానల్‌లో రానుంది?

ప్రస్తుతానికి షూటింగ్ ప్రారంభమైంది, ఈ షోకు సంబంధించిన పేరు, ప్రసారమయ్యే ఛానల్ వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe