బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో విన్నర్ ఎవరో ఓ క్లారిటీ వచ్చేసినట్లే ఉంది. ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్ చూస్తే ఇది ఖాయమనిపిస్తోంది. ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తాడనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. జనాలు అతనికి తమ ఓట్లతో మద్దతు తెలియజేస్తున్నారు. కల్యాణ్ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ టాప్-5

బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ కు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు ముందు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే హౌస్ లో టాప్-5 కంటెస్టెంట్లు ఉన్నారు. పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన గల్రానీ ఫైనల్ కు అర్హత సాధించారు. వీళ్లలో నుంచి ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ ఒకరు ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
విన్నర్ గా కల్యాణ్!
బిగ్ బాస్ తెలుగులో ఈ సీజన్ ను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లలో చాలా మంది మాట.. విన్నర్ కల్యాణ్. అవును.. ఇప్పుడు ఎక్కువ మంది నుంచి ఇదే వినిపిస్తోంది. కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టిన సైనికుడు కల్యాణ్ మొదటి నుంచి అదరగొడుతూ వచ్చాడు. అటు టాస్క్ ల్లో, ఇటు క్యారెక్టర్ పరంగా బెస్ట్ గా నిలిచి ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు.
బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్
బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ లో వార్ వన్ సైడ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పడాల కల్యాణ్ కు పడుతున్న ఓట్లే. ప్రస్తుతం ఓటింగ్ లో కల్యాణ్ టాప్ లో దూసుకుపోతున్నట్లు తెలిసింది. అతనికి ఇప్పుడు 42.19 శాతం ఓట్లున్నాయని అంటున్నారు. ఈ ఓట్లతో అతను నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
తనూజ ఇలా
ఇక టైటిల్ రేసులో ప్రధాన పోటీదారులు అనుకుంటున్న తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్ ఓటింగ్ లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పవన్ కు తనూజ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆమె ఖాతాలో ప్రస్తుతం 30.34 శాతం ఓటింగ్ ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఏమైనా ట్రెండ్ మారితే తనూజ లీడ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
{{/usCountry}}ఇక టైటిల్ రేసులో ప్రధాన పోటీదారులు అనుకుంటున్న తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్ ఓటింగ్ లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పవన్ కు తనూజ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆమె ఖాతాలో ప్రస్తుతం 30.34 శాతం ఓటింగ్ ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఏమైనా ట్రెండ్ మారితే తనూజ లీడ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
{{/usCountry}}ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే అయితే ఇమ్మాన్యుయెల్ 12.18 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రకంగా అతను టైటిల్ కొట్టడమే కష్టమే అనిపిస్తోంది. కానీ బిగ్ బాస్ ఫినాలేలో ఏం చేస్తాడో తెలియదు. అనూహ్యంగా ఇమ్ము కప్ దక్కించుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక డీమాన్ పవన్ (10.57 శాతం), సంజన గల్రానీ (4.71 శాతం) టైటిల్ ఆశలు వదులుకోవాల్సిందే.