15 వారాలు.. 105 రోజుల సంగ్రామం. ఎంతో మంది కంటెస్టెంట్లు. మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీలు.. చివరకు మిగిలేది ఒకే ఒక్కరు. నిలిచేది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరూ అనేది ఈ రోజే తేలిపోనుంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరో అనౌన్స్ అవుతుంది. ఆదివారమే గ్రాండ్ ఫినాలే.
బిగ్ బాస్ 9 ఫినాలే

బిగ్ బాస్ 9 తెలుగు సమరానికి క్లైమాక్స్. విజేత ఎవరో తేలే రోజు వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే ట్రోఫీని ముద్దాడే కంటెస్టెంట్ ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. డిసెంబర్ 21న రాత్రి 7 గంటల నుంచి ఫినాలే స్టార్ట్ అవుతుంది. జియోహాట్ స్టార్ ఓటీటీలోనూ ఈ ఫైనల్ ను చూడొచ్చు.
విన్నర్ ఎవరు?
ఇప్పుడు అందరి ఫోకస్ బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు? అనేదానిపైనే ఉంది. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తోంది. హౌస్ లో టాప్-5లో నిలిచిన పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్ ఫినాలేకు చేరారు. అయితే ఇందులో సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అవుతారని తెలిసింది. ఈ రోజు ఫినాలేలో ఫస్ట్ ఈ ఇద్దరు కంటెస్టెంట్లను రేసు నుంచి తప్పిస్తారని సమాచారం.
ఇద్దరు కామనర్లు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య సాగింది. ఇప్పుడు టాప్-3లో కల్యాణ్, తనూజ, డీమాన్ పవన్ ఉంటారు. వీళ్లలో కల్యాణ్, పవన్ ఇద్దరూ కామనర్లు కావడం విశేషం. చివరకు కల్యాణ్, తనూజ మధ్య టైటిల్ వార్ జరిగే అవకాశముంది. మరి ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ ఉపేస్తోంది.
చీఫ్ గెస్ట్
బిగ్ బాస్ సీజన్లలో ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా ఓ ప్రముఖ సెలబ్రిటీ వచ్చి విజేతను అనౌన్స్ చేస్తుంటారు. గత కొన్నేళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ సార్లు వచ్చారు. దీంతో ఈ సారి కూడా మెగాస్టార్ రాబోతున్నారనే టాక్ వినిపించింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్ కోసం చిరు వస్తారనే ప్రచారం కొనసాగింది. కానీ మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ ప్రమోషన్లలో భాగంగా డార్లింగ్ ప్రభాస్ వస్తారని అన్నారు.
{{/usCountry}}బిగ్ బాస్ సీజన్లలో ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా ఓ ప్రముఖ సెలబ్రిటీ వచ్చి విజేతను అనౌన్స్ చేస్తుంటారు. గత కొన్నేళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ సార్లు వచ్చారు. దీంతో ఈ సారి కూడా మెగాస్టార్ రాబోతున్నారనే టాక్ వినిపించింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్ కోసం చిరు వస్తారనే ప్రచారం కొనసాగింది. కానీ మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ ప్రమోషన్లలో భాగంగా డార్లింగ్ ప్రభాస్ వస్తారని అన్నారు.
{{/usCountry}}చివరకు ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజ్ రవితేజ ఈ సారి బిగ్ బాస్ సీజన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలిసింది. భర్త మహాశయులకు విజ్ణప్తి సినిమాతో రవితేజ సంక్రాంతి రేసులోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి రవితేజ బిగ్ బాస్ ఫినాలేకు వచ్చి విజేతకు ట్రోఫీ అందిస్తారని తెలిసింది.