...
...
Next Story

షాకింగ్.. రీతును నామినేట్ చేసిన డీమాన్ పవన్.. లవ్ బర్డ్స్ కు ఏమైంది? ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 11వ వారంలో బిగ్ ట్విస్ట్. లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న రీతు చౌదరి, డీమాన్ పవన్ మధ్య నామినేషన్ వార్ చోటు చేసుకుంది. రీతును పవన్ నామినేట్ చేయడం గమనార్హం.

Published on: Nov 17, 2025, 11:08:44 IST
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదకొండో వారం నామినేషన్లలో షాక్. లవ్ బర్డ్స్ అంటూ హౌమ్ మేట్స్, ఆడియన్స్ అనుకుంటున్న రీతు చౌదరి, డీమాన్ పవన్ మధ్య నామినేషన్ వార్ జరిగింది. రీతును పవన్ నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ వేరే లెవల్ అనేందుకు ఇదే నిదర్శనం.

రీతు నామినేషన్

రీతును నామినేట్ చేసిన పవన్ (youtube)
రీతును నామినేట్ చేసిన పవన్ (youtube)

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 11వ వారం నామినేషన్ ప్రక్రియ హోరీహోరీగా సాగింది. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి రీతు, పవన్ క్లోజ్ గానే ఉంటున్నారు. వీళ్ల మధ్య మంచి బాండ్ ఏర్పడింది. అది లవ్ అని హౌస్ మేట్స్ అంటూనే ఉన్నారు. ఇది లవర్స్ పార్క్ లా ఉందని కూడా హౌస్ నుంచి వెళ్లిపోయిన అయేషా, రమ్య మోక్ష చెప్పారు. రీతు కూడా పవన్ తో స్పెషల్ బాండ్ ఫామ్ అయిందని, అది నా ఇష్టం అని కూడా స్పష్టం చేసింది. అలాంటిది రీతును డీమాన్ పవన్ నామినేట్ చేశాడు.

బిగ్ బాస్ నామినేషన్స్

ఈ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లేందుకు రీతును డీమాన్ పవన్ నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన కోసం ఎంతో చేశానని, ఎన్నో సార్లు స్టాండ్ తీసుకున్నానని, కానీ ట్రస్ట్ లేదని అన్నావని ఎమోషనల్ అవుతూనే రీతును నామినేట్ చేశాడు పవన్. ఆ సమయంలో రీతు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు అరుచుకుని దూరం వెళ్లిపోయారు.

ఆరుగురు

ఈ వారం నామినేషన్లలో రీతుకే ఎక్కువగా 4 ఓట్లు పడ్డాయి. కానీ ఆమె మాత్రం సేఫ్ అయినట్లు తెలిసింది. కెప్టెన్ తనూజ తన పవర్ తో రీతును నామినేషన్ నుంచి సేవ్ చేసినట్లు సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks